Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. డిసెంబర్ 9న శనివారం ద్వాదశ రాశులపై చిత్తా నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఆకస్మిక అదృష్టం రానుంది. 2 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
మేషరాశి:
భవిష్యత్ గురించి ప్రణాళికలు వేస్తారు. కటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులు కొన్ని విషయాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటారు. వ్యాపారుల పెట్టుబడులకు అనుకూలం.
వృషభం:
ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అనవసర వాదనలకు దిగొద్దు. రాజకీయ నాయకులకు పొత్తులు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మిథునం:
గతంలో ఉన్న వివాదాలు ఈరోజుతో ముగిసిపోతాయి.వ్యాపారులు పెట్టుబడులు పెడితే భవిష్యత్ లో అత్యధిక ప్రయోజనాలు ఉంటాయి. సాయంత్రం బంధువులతో కలిసి ఆనందంగా ఉంటారు.
కర్కాటకం:
సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఓ సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది. బాధ్యతలు నెరవేర్చడంలో విజయం సాధిస్తారు. స్నేహితులతో సరదాగా ఉంటారు.
సింహం:
ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం. వ్యాపారులకు కూడా పెట్టుబడులు లాభాలనిస్తాయి. కొన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.
కన్య:
రోజువారీ అవసరాలకు డబ్బు అందుతుంది. కొత్త ప్రణాళికలు చేపట్టే వారికి మంచి అవకాశాలు వస్తాయి. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతారు.
తుల:
ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. పెండింగులో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. శత్రువులు మీపై ఆధిపత్యానికి ప్రయత్నిస్తారు. వారితో జాగ్రత్తగా మెలగాలి.
వృశ్చికం:
కుటుంబ అవసరాల గురించి చర్చిస్తారు. వ్యాపారం కోసం ఇతరుల నుంచి డబ్బను ఆశిస్తే అందుతుంది. కోపాని అదుపులో పెట్టుకోవాలి. లేకుంటే సమస్యలు వస్తాయి.
ధనస్సు:
మీకు వచ్చే కొంత డబ్బలో దానం చేస్తారు. ఇన్ని రోజులు ఉన్న ఒత్తిడి తొలిగిపోతుంది. ఇతరులను ఎక్కువగా నమ్మాల్సిన అవసరం లేదు. వారితో జాగ్రత్తగా మెలగాలి.
మకర:
వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఇంటికి అతిథులు రావొచ్చు. వ్యాపారులు భాగస్వాముల నుంచి సలహాలు తీసుకోవాలి. కొంత డబ్బు ఖర్చు అవుతుంది.
కుంభం:
మీపై ప్రత్యేక దృష్టి పెడుతారు. అయినా రోజూవారీ పనులకు ఆటంకం కలగనీయొద్దు. ఖర్చులను నియంత్రించాలి. లేకుండా ఆర్థిక లోటు ఏర్పడుతుంది. ఓ పని కోసం ప్రభుత్వ అధికారిని కలుస్తారు.
మీనం:
ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. తండ్రితో ఎక్కువగా వాదనలకు దిగొద్దు. లావాదేవీల విషయంలో భాగస్వామిని సంప్రదించాలి. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.