Akshaya Tritiya Horoscope Today: అక్షయ తృతీయ వేళ ఈ రాశుల వారికి అదనపు ఆదాయం..

2025 మే 10 శుక్రవారం రోజున ద్వాదశ రాశులపై రోహిణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు వృషభ రాశిలో సంచరించనున్నాడు. అరోజు అక్షయ తృతీయ సందర్భంగా కొన్ని రాశుల వారికి ఊహించిన దానికి ఎక్కువ డబ్బు వస్తుంది.

Written By: Chai Muchhata, Updated On : May 10, 2024 8:08 am

horoscope today

Follow us on

Akshaya Tritiya Horoscope Today: 2025 మే 10 శుక్రవారం రోజున ద్వాదశ రాశులపై రోహిణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు వృషభ రాశిలో సంచరించనున్నాడు. అరోజు అక్షయ తృతీయ సందర్భంగా కొన్ని రాశుల వారికి ఊహించిన దానికి ఎక్కువ డబ్బు వస్తుంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉండనున్నాయి. అలాగే 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..

మేషరాశి:
అక్షయ తృతీయ ఈ రాశి వారికి కలిసి వస్తుంది. కొత్త ఉత్సాహంతో పని చేస్తారు. గతంలో పెండింగులో ఉన్న పనులను పూర్తి చేస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.

వృషభ రాశి:
ఈ రాశి వారికి అనుకున్న దాని కంటే ఎక్కువ డబ్బు అందుతుంది. బాధ్యతలు నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. బావోద్వేగాలకు లోనవుతారు.

మిథునం:
ఈ రాశి వారికి అక్షయ తృతీయ శుభఫలితాలు కలగనున్నాయి. వ్యాపారులకు అదనపు ఆదాయం వస్తుంది. ఆధ్యాత్మికతపై శ్రద్ధ వహిస్తారు. కొన్ని శుభవార్తలు వింటారు.

కర్కాటకం:
ఉద్యోగులకు కార్యాలయాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటారు. కొన్ని పనుల్లో చికాకును ఎదుర్కొంటారు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. పిల్లలకు విలువైన సాంప్రదాయాలు నేర్పిస్తారు.

సింహ:
ఆస్తుల కొనుగోలుకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ రంగంలో పనిచేసేవారికి శుభఫలితాలు వస్తాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

కన్య:
ఉద్యోగుల పనితీరు బాగుంటుంది. కష్టపడి పనిచేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. డబ్బు ఎవరికీ ఇవ్వకండి.

తుల:
ప్రతీ పనిలో చొరవ తీసుకొని ముందుకు సాగుతారు. వ్యక్తిగతంగా సంతోషంగా ఉంటారు. సమాజంలో గౌరవం పెరుగుతంది. కొన్ని విషయాల్లో గొడవలు పడుతారు.

వృశ్చికం:
సంబంధాలు మెరుగుపడుతాయి. ఇతరుల పనిపై శ్రద్ధ వహించాల్సిన అవసరం లేదు. ఆదాయం పెరుగుతుంది. దీంతో సంతోషంగా ఉంటారు.

ధనస్సు:
ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. డబ్బు వ్యవహారాల్లో పొరపాట్లు చేయకూడదు. కొన్ని పనులు పూర్తి చేయడంలో బిజీగా ఉంటారు. ముఖ్యమైన విషయంపై సీరియస్ గా పనిచేస్తారు.

మకర:
స్నేహితులను కలుస్తారు. ఓ అతిథి ఇంటికి వస్తారు. కొన్ని తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. డబ్బు వ్యవహారాల్లో జగ్రత్తగా ఉండాలి. ఆదాయం పెరుగుతుంది.

కుంభం:
పెండింగు పనులు పూర్తి చేస్తారు. కొన్ని శుభవార్తలు వింటారు. మీలో దాగి ఉన్న ప్రతిభ కారణంగా మంచి లాభాలు వస్తాయి. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

మీనం:
ఉద్యోగులు రాజయోగం పొందుతారు. వ్యాపారులు పెట్టుబడులపై శ్రద్ధ వహించాలి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే నష్టాన్ని ఎదుర్కొంటారు.