According to Puranas : కొన్ని పురాణాల ప్రకారం.. ప్రతి మనిషి ఏడు జన్మలెత్తుతాడని అంటారు. కొన్నాళ్ల పాటు భూమ్మీద ఉండి మరణించిన తరువాత ఏదో రూపంల మళ్లీ జన్మిస్తాడని అంటుంటారు. అయితే ఒక్కసారి జన్మించిన తరువాత ఎవరైనా చనిపోకుండా ఉండలేరు. ఎంతటి గొప్ప వ్యక్తులైనా ఎప్పుడోసారి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సిందే. టెక్నాలజీ, ఇతర మెడిసిన్లతో ఎన్నో రోగాలను నయం అవతున్నాయి. కానీ మృత్యువు నుంచి తప్పించుకునే మార్గాన్ని ఎవరూ కనిపెట్టడం లేదు. అయితే కొందరు జన్మించిన వారు ఇప్పటికీ బతికే ఉన్నారట. వారి కళ్ల ముందు యుగాలు మారుతున్నా.. వారికి మరణం రావడం లేదట. వారెవవరో తెలుసా?
అశ్వత్థామ:
ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడి’ గురించి అందరికీ తెలిసింది. సోషియో ఫాంటసీ డ్రామాగా వచ్చిన ఈ మూవీ అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది. ఈ మూవీలో అశ్వత్థామ పాత్ర కీలకంగా ఉంటుంది. మహాభారతంలో అశ్వత్థామ కౌరవుల వైపు ఉండటాడు. అన్ని విద్యల్లో ఆరితేరిన అశ్వత్థామ కురుక్షేత్రంలో పాల్గొంటారు. ఈ సమయంలో ద్రౌపతి కుమారులను చంపుతాడు. అభిమన్యుడు కుమారుడు పరీక్షిత్తును గర్భంలో ఉండనేగా చంపబోతుండగా కృష్ణుడు కాపాడుతాడు. ఆ తరువాత అశ్వత్థామకు శాపం పెడుతాడు. యుగాలుగా జరిగే పాపాలను చూస్తూ బతకాలని శాపం పెడుతాడు. అలా అశ్వత్థామ ఇప్పటికీ బతికే ఉన్నాడని అంటారు.
ఆంజనేయస్వామి:
రామాయణంలో ఆంజనేయ పాత్ర ఏంటో అందరికీ తెలిసిందే. సీత జాడ కోసం వెళ్లిన హనుమంతుడు లంక దహనం చేస్తాడు.ఆ తరువాత రాముని బంటుగా ఉండిపోతాడు. ఈ సమయంలో రాముని అవతారంలో ఉన్న విష్ణువు.. హనుమంతుడి సేవకు మిచ్చి చిరంజీవిగా ఉండాలని దీవిస్తాడు. అలా ఆంజనేయుడు ఇప్పటికీ బతికే ఉన్నాడని అంటారు. అంతేకాకుండా ఆంజనేయుడికి భక్తులు నిత్యం పూజలు నిర్వహిస్తూ ఉంటారు.
పరుశురాముడు:
మహా విష్ణువు దశవతారాల్లో పరుశుముడి అవతారం ఒకటి. కట్టలు తెగే కోపంతో ఉండే పరుశురాముడికి ప్రత్యేక చరిత్ర ఉంది. ఇతను 21 సార్లు చక్రవర్తులందరినీ జయిస్తాడు. దీంతో కాలాలన్నింటికీ సమన్వయ కర్తగా ఉంటాడు. పరుశురాముడు కూడా ఇప్పటికీ జీవించే ఉన్నాడని పురాణాల ప్రకారం తెలుస్తోంది.
బలి చక్రవర్తి:
వామనుడు కోరిక ప్రకారం బలిచక్రవర్తి బలయిన విషయం కొన్ని చరిత్రలను బట్టి తెలుస్తుంది. మూడడుగుల స్థలం కావాలని వామనుడు కోరగా బలి చక్రవర్తి వెంటనే ఒప్పుకుంటాడు. కానీ అతడిని పాతాళానికి వామనుడు తొక్కేస్తాడు. కానీ బలి చక్రవర్తి ఇప్పటికీ బతికే ఉన్నాడట. బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కిన రోజును కేరళీయలు ఓనమ్ పండుగ చేసుకుంటారు.
విభీషణుడు:
రామాయణంలో లంక పేరు చెప్పగానే జడుసుకుంటారు. ఈ రాజ్యంలో దాదాపు అందరూ మూర్ఖులే అనుకుంటారు. కానీ రావణుడి స్వయాన తమ్ముడు విభీషణుడు మాత్రం న్యాయంగా ఉంటాడు. ఇతడు రాముడికి సహకరిస్తాడు. అయితే విభీషణుడు ఇప్పటికీ బతికే ఉన్నాడట. ఇతనికి రాజస్థాన్ లో ఓ గుడి కూడా కట్టారు.
వేదవ్యాసుడు:
మహాభారతాన్ని రచించించి వేద వ్యాసుడు అని చరిత్ర చెబుతోంది. అయితే వేద వ్యాసుడు కూడా ఇప్పటికీ బతికే ఉన్నాడట.
మార్కండేయ:
శివునిపై తనకు ఉన్న భక్తిని చిన్నతనంలోనే చెప్పాడు మార్కండేయుడు. ఆయన ప్రాణం తీసుకోవడానికి వచ్చిన యముడిపై శివుడు ఆగ్రహం చేస్తాడు. అలా మార్కండేయ స్వామి ఇప్పటికీ మతికే ఉన్నాడట.
కృష్ణాచార్యుడు:
మహాభారతంలో కృష్ణాచార్యుడి పేరు వినిపిస్తుంది. పాండవులకు, కౌరవులకు గురువుగా ఉన్న ఇతను ఇప్పటికీ బతికే ఉన్నాడట.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: According to puranas these 8 people are still alive do you know who they are
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com