Viral Video : ప్రతీ ఏటా పది రోజుల పాటు వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటారు. ప్రతిరోజూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వామివారిని కొలుస్తారు. తమ విఘ్నాలను తొలగించి జీవితం బాగు చేయాలని విద్యార్థుల నుంచి పెద్దల వరకు అందరూ ఆ విఘ్నేశ్వరుడిని కోరుకుంటూ ఉంటారు. ఇలా పది రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచి ఆ తరువాత సమీపంలోని కొలనులో లేదా చెరువులో నదిలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తుంటారు. చిన్న వినాయక విగ్రహాల నుంచి భారీ విగ్రహాలను రకరకాల పద్దతుల ద్వారా నిమజ్జనం చేస్తుంటారు. భారీ విగ్రహాలను క్రేన్ల సహాయంతో నీటిలో వేస్తారు. కొన్నిప్రాంతాల్లో బోటుల్లో గణేశుడిని తీసుకొని వెల్లి నదీ మధ్యలో వేస్తుంటారు. అయితే చిన్న విగ్రహాలను నిమజ్జనం చేసే క్రమంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దు. ఆ చిన్న పాటి కేర్ లెస్ కారణంగా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఆ నిర్లక్ష్యం ఏంటో ఈ వీడియోలో ఉంది. అదేంటో చూడండి..
వినాయక నిమజ్జన సమయంలో ముందుగా ఊరేగిపుంలు నిర్వహిస్తుంటారు. గ్రామాల్లో, పట్టణాల్లో శోభాయాత్ర నిర్వహించిన తరువాత సమీపంలోని చెరువులో విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. అయితే నిమజ్జన సమయంలో ఎన్నో ప్రమాదాలు జరిగిన వీడియోలు బయటకు వచ్చాయి. అయినా కొందరు జాగ్రత్తలు పాటించకపోవడంతో అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిమజ్జన ప్రదేశంలో పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయడం గానీ.. లేదా చిన్న విగ్రహాలు నిమజ్జనం చేసేవారికి ప్రత్యేక ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తుంటారు.
అయితే చిన్న విగ్రహం నిమజ్జనం చేసే సమయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కేర్ లెస్ గా ఉంటే ఎలాంటి ప్రమాదం జరుగుతుందో ఈ వీడియోనే నిదర్శనం. ఈ వీడియో నార్త్ లోని ఓ రాష్ట్రానికి సంబంధించినట్లు తెలుస్తోంది. ఓ దేవాలయంలోని కొలనులో వినాయక నిమజ్జనానికి కొందరు తమ పిల్లలతో కలిసి నిమజ్జనానికి వెళ్తారు. అయితే చిన్న పిల్లలను నీటి వరకు తీసుకెళ్తారు. అయితే వారు చిన్న పిల్లలను పట్టించుకోరు. ఇంతలో వారిలో ఒక వ్యక్తి వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. అయితే ఆ వ్యక్తితో పాటు ఓ అమ్మాయి వెళ్తుంది. అలా ముందుకు వెళ్లగా ఒక్కసారిగా నీటిలో మునిగిపోతుంది.
ఈ సంఘటనను మరో వ్యక్తి వీడియో తీస్తుంటాడు. ఈ దృశ్యం చూడగానే వెంటనే తన కెమెరాను పక్కన పెట్టి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఈ వీడియోను బట్టి తెలిసిందేంటంటే.. నిమజ్జనం సమయంలో చిన్న పిల్లలను వెంట తీసుకెళ్లకపోవడమే మంచిదని కొందరు సూచిస్తున్నారు. ఒకవేళ వెళ్లినా వారిని నీటి వరకు తీసుకెళ్లకుండా ఉండాలి. ఈ వీడియోలో మరో వ్యక్తి గమనించారు కాబట్టి ఎలాంటి నష్టం జరగలేదని తెలుస్తుంది. కానీ ఎవరూ చూడకపోతే మాత్రం అమ్మాయి ప్రాణాలు పోయే ప్రమాదం ఉండేది. అందువల్ల నిమజ్జన సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వీడియో కింద కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా నిమజ్జన కార్యక్రమంలో పిల్లలను దూరంగా ఉంచడమే మంచిదని పేర్కొంటున్నారు.
View this post on Instagram
A post shared by Jitendrasinghbouddh Buddhpriyabuddhist (@jitendrasinghbouddh)
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read More