https://oktelugu.com/

Komuravelli Mallanna Temple : కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి మహిళా అఘోరా.. వీరి జీవన విధానం ఎలా ఉంటుంది?

కొమురవెళ్లికి వచ్చిన మహిళా అఘోరా కారులో మనిషి పుర్రెలు కనిపించాయి. వీరి శరీరం విభిన్నంగా ఉంటుంది. శరీరం ఎటు వీలైతే అటు వంచుతారు. ఎలాంటి దుస్తులు ధరించకుండా నగ్నంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. కొన్ని సందర్భాల్లో మాత్రమే వీరు లంగోటాను ధరిస్తారు. పురుషుల్లాగే వీరు కూడా స్మశానంలో నిద్రిస్తారు

Written By:
  • Srinivas
  • , Updated On : September 8, 2024 / 03:56 PM IST

    Female Aghora

    Follow us on

    Komuravelli Mallanna Temple :  ప్రముఖ కొమురవెల్లి మల్లన్న క్షేత్రాన్ని నిత్యం భక్తులు దర్శిస్తుంటారు. సిద్ధిపేట జిల్లాలోని చేర్యాల మండలంలో ఉన్న ఈ క్షేత్రానికి ఆదివారం భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. అయితే ఇటీవల ఈ క్షేత్రంలో విచిత్రం చోటు చేసుకుంది. ఉత్తరాదిన ఉండే అఘోరా మహిళ కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో దర్శనమిచ్చారు. సాధారణంగా వీరు శివుడి కోసం హిమాలయాల్లో తపస్సులు చేస్తూ ఉంటారు. కానీ కొమురవెల్లి దేవాలయానికి వారు రావడం ఆసక్తిగా మారింది. ఓ కారు నుంచి దిగిన వీరు నడుచుకుంటూ క్షేత్రంలోకి వెళ్లారు. దీంతో కొందరు తమ కెమెరాలో బంధించారు. అయితే వీరు రావడాబవకి గల కారణమేంటి? అనే చర్చ సాగుతోంది.

    అఘోరాల్లో వివిధ రకాలుగా ఉంటారు. కొందరు కాలుతున్న శవాల మధ్య ఉంటారు. వారు అక్కడే నివాసం ఏర్పరుచుకొని జీవిస్తారు. కానీ మహిళా అఘోరాలు చాలా అరుదుగా ఉంటారు. వీరు ఎక్కువగా నార్త్ ఇండియాలో నే కనిపిస్తారు. సాధారణంగా ఇలాంటి వారు సినిమాల్లోనే కనిపిస్తారు. కానీ వీరు కాశీ, ప్రయాగ, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో వీరు కనిపిస్తారు. అయితే పురుషుల అఘోరాల కంటే చాలా కఠినంగా ఉంటారు. వీరి శరీరం మొత్తం మట్టి కట్టుకుపోయి ఉంటుంది. ఒంటినిండా గాయాలతో కనిపిస్తారు.

    వీరు ఎక్కువగా మనిషి పుర్రెలతో పూజలు చేస్తారు. తాజాగా కొమురవెళ్లికి వచ్చిన మహిళా అఘోరా కారులో మనిషి పుర్రెలు కనిపించాయి. వీరి శరీరం విభిన్నంగా ఉంటుంది. శరీరం ఎటు వీలైతే అటు వంచుతారు. ఎలాంటి దుస్తులు ధరించకుండా నగ్నంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. కొన్ని సందర్భాల్లో మాత్రమే వీరు లంగోటాను ధరిస్తారు. పురుషుల్లాగే వీరు కూడా స్మశానంలో నిద్రిస్తారు. శవాలతో గుడుపుతూ ఉంటారు. ఎక్కువగా బ్రహ్మచర్యం పాటిస్తూ శృంగారాలకు దూరంగా ఉండాలి.

    అయితే అఘోరాగా మారాలంటే పిండ ప్రదానం చేయాలి. ముందుగా కుటంబ సభ్యులను వదిలేయాలి. నాగసాధువుగా మారిన తరువాత తమ అలవాట్లను పూర్తిగా మార్చుకుంటారు. బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి నిత్య కర్మ చేసిన తరువాత పూజలు చేస్తారు. ఎక్కువగా శివారాధన చేస్తుంటారు. ఈశ్వరనామం జపం చేస్తూ పూజలు చేస్తుంటారు. వీరి పూజలు భయంకరంగా ఉంటాయి. మధ్యాహ్నం వరకు ఎలాంటి భోజనం చేయరు. భోజనం చేసిన తరువాత మళ్లీ పూజల్లో పాల్గొంటారు.

    ప్రతీరోజూ అఘోరాలు వివిధ పూజల్లో పాల్గొంటారు. సాయంత్రం దత్తాత్రేయ పూజలు ఎక్కువగా చేస్తారు. వీరికి ఎలాంటి కోరికలు ఉండవు. కేవలం తమ జన్మ మోక్షం కలిగించడానికి మాత్రమే పూజలు చేస్తారు. మహిళ అఘోరాలు చనిపోతే తమ శరీరాలను కుటుంబ సభ్యులకు అప్పగించరు. వారి శరీరాలను నదిలో పడేస్తారు. వారికి ఎలాంటి దినకర్మలు చేయకుండా ఉంటారు. అయితే ఇలా చేస్తారు అనేది నిజమా? కాదా? అనేది మాత్రం ఎక్కడా ధ్రువీకరణ లేదు. కొందరు వారి జీవన విధానాన్ని బట్టి అంచనా వేస్తున్నారు.

    మహిళా అఘోరాలు కాషాయ వస్త్రాలు ధరిస్తారు. కానీ కొందరు ఎలాంటి దుస్తులు వేసుకుండా ఉంటారు. విదేశాలకు చెందిన కొందరు మహిళలు కూడా అఘోరాలతో కలిసి ఉండడానికి ఇష్టపడ్డారు. వీరు ఎక్కువగా కాశీ, వారణాసి ప్రాంతాల్లో కనిపిస్తారు. అయితే కొందరు నిత్య తపస్సు కోసం హిమాలయాలకు వెళ్తారు.