Horoscope Today
Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై మృగశిర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఏ రోజు రవి యోగం ఏర్పడడంతో కొన్ని రాశుల వారికి శని దేవుడి అనుగ్రహం కలగనుంది. మరి కొన్ని రాశుల వారు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. పెండింగ్ బకాయిలు వసూలు అవుతాయి. పూర్వీకుల ఆస్తి విషయంలో శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు శత్రువుల విడత ఎక్కువగా ఉంటుంది.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రుల సలహాతో వ్యాపారులు కొత్తపెట్టుబడులు పెడతారు. కొత్త వ్యక్తులు పరిచయం అయితే వారికి ఎలాంటి అప్పులు ఇవ్వకుండా ఉండాలి. ఇంటి అవసరాల కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. అనుకోకుండా ప్రయాణాలు ఉంటాయి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారికి శని దేవుడి అనుగ్రహం ఉండనుంది.జీవిత భాగస్వామికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యపై దృష్టి పెట్టాలి. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందడానికి మార్గం ఏర్పడుతుంది. ఏ పని పూర్తి చేసిన కష్టపడాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : కొన్ని పనుల కారణంగా వ్యాపారులు బిజీగా ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. పాత స్నేహితులను కలవడం వల్ల మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఉద్యోగులు సీనియర్ల నుంచి మద్దతు పొందుతారు. దీంతో అనుకున్న లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఇంట్లో జరిగే శుభకార్యం గురించి చర్చిస్తారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : విహారయాత్రలకు వెళ్లడానికి ప్లాన్ చేస్తారు. స్నేహితులతో వెళ్లాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. వాహనాలపై ప్రయాణాలు చేసేవారు సూచనలు పాటించాలి. ఎవరికైనా పాత ఆపులు ఉంటే ఈరోజు చెల్లిస్తారు. ఎంతో కాలంగా వెంటాడుతున్న సమస్యలు నేటితో పరిష్కారం అవుతాయి. ఉద్యోగులు ఉన్నతాధికారులతో సత్సంబంధాలు నెలకొంటారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : శనివారం ఈ రాశి వారికి శనీశ్వరుని అనుగ్రహం ఉంటుంది.వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి. దీంతో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో వాగ్వాదం ఉంటుంది. పిల్లల ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఉద్యోగులు క్రమశిక్షణ పనిచేయడం వల్ల ప్రశంసలు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ పొందే అవకాశం. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : కుటుంబ సభ్యులతో కలిసి దైవ క్షేత్రాలు సందర్శిస్తారు. విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి. పిల్లలనుంచి కొన్ని శుభవార్తలు వింటారు. విదేశాల్లో ఉండేవారి నుంచి ఆ సమాచారం ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసే వారికి ఊహించని లాభాలు ఉంటాయి. రోజువారి ఖర్చులను అదుపులోకి ఉంచుకోవాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ పనులకు తోటి వారు ఇబ్బందులు కలిగించే అవకాశం. జీవితం భావస్వామితో బయటికి వెళ్లాల్సి వస్తే ఖర్చులు ఉంటాయి. స్నేహితుల సహకారంతో మన సహాయం అందుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. పెండింగ్ అప్పులను తీరుస్తారు.
ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : స్నేహితుల నుంచి ప్రయోజనాలు పొందుతారు. ప్రియమైన వారితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపారులు కొత్త పనులను ప్రారంభించుతారు. అనుకోకుండా ప్రయాణాలు ఉంటాయి ఇవి లభిస్తాయి. ఒక పనిని పూర్తి చేయడానికి తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. పనిపారం నుంచి తప్పించుకోవడానికి ఉల్లాసంగా గడుపుతారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ప్రభుత్వ పథకాలతో ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారులకు ఊహించని దానికంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల కెరీర్ కు సంబంధించి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి సలహాతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఉద్యోగులకు పదోన్నతి వచ్చే అవకాశాలు ఎక్కువ. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వాహనాలపై ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులతో పరిచయం అంత మంచిది కాదు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఉద్యోగులు సీనియర్ సభ్యుడు సహాయంతో విజయం సాధిస్తారు. దీంతో పదోన్నతి పొందేందుకు ఆస్కారం ఉంటుంది. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. వ్యాపారులకు కొన్ని ప్రతికూల ఫలితాలు ఉంటాయి. వాహనాలపై ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తలు తీసుకోవాలి.