Mahesh Babu- Jr. NTR : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. వాళ్ళ నాన్న కృష్ణ గారి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ముందుకు తీసుకెళుతున్న మహేష్ బాబు తన ఎంటైర్ కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందించాడు. అయితే ఇప్పుడు రాజమౌళితో చేస్తున్న పాన్ వరల్డ్ సినిమాతో మరోసారి ప్రేక్షక లోకాన్ని అలరించడానికి సిద్ధమవుతున్నాడు… ఇక ఇదిలా ఉంటే నందమూరి మూడోవ తరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నాడు. కెరియర్ స్టార్టింగ్ లోనే భారీ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో కూడిన సినిమాలను చేసి తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న ఆయన ఇప్పుడు చేస్తున్న సినిమాలతో పాన్ ఇండియాలో తన సత్తాను చాటుకుంటున్నాడు. ఇక రీసెంట్ గా చేసిన ‘దేవర’ (Devara)సినిమా తో ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా 600 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టి తెలుగు సినిమా స్థాయిని మరొక మెట్టు పైకి ఎక్కించాడనే చెప్పాలి… ఇక ఇదిలా ఉంటే నిజ జీవితంలో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ చాలా మంచి ఫ్రెండ్స్… ఇక జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబుని అన్న అని పిలుస్తూ ఉంటాడు. కాబట్టి వీళ్లిద్దరి మధ్య ఎలాంటి క్లాశేష్ అయితే లేవు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న చాలా మంది ప్రొడ్యూసర్లు వీళ్ళ కాంబినేషన్ లో ఒక మల్టీస్టారర్ సినిమా తెరకెక్కించాలనే ఉద్దేశ్యంతో ఒక 15 సంవత్సరాల కిందటే ప్రణాళికలైతే రూపొందించారు.
ఇక దానికి తగ్గట్టుగానే జయంత్ సి పరాంజీ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ చాలా రకాల కథనాలైతే వెలువడ్డాయి. ఇటు మహేష్ బాబు ఎన్టీయార్ ఇద్దరు కూడా సినిమా మీద ఆసక్తి చూపించిన కూడా ఆ కథ అనేది ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఉండే విధంగా డెవలప్ అవ్వకపోవడంతో ఆ కథను పక్కన పెట్టేసినట్టుగా తెలుస్తోంది.
ఇక జయంత్ సి పరాంజీ మహేష్ బాబుతో టక్కరి దొంగ అనే సినిమా చేసి అతనికో డిజాస్టర్ ని కట్టబెట్టాడు. అయినప్పటికీ అతనితో సినిమా చేయడానికి మహేష్ బాబు ఇంట్రెస్ట్ చూపించాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఆయనతో ఒక్క సినిమా కూడా చేయలేదు. నిజానికి జయంత్ చాలా మంచి మేకర్ ఆయన చేసే సినిమాలన్ని చాలా కొత్తగా ఉంటాయి.
నాగార్జున, బాలయ్య బాబు, వెంకటేష్ లతో సినిమాలను చేసి మంచి విజయాలను అందుకున్నాడు. ఇక సీనియర్ హీరోలందరికి మంచి విజయాలను అందించిన ఆయన యంగ్ హీరోలకి మాత్రం సక్సెస్ ని అందించలేకపోయాడు. ఇక ప్రభాస్ తో ఈశ్వర్, టక్కరి దొంగ లాంటి సినిమాలను చేసి చేసినప్పటికి ఆశించిన మేరకు సక్సెస్ లను సాధించలేకపోయాడు…