Delhi election results 2025 : ఢిల్లీ శాసనసభ ఫలితాలు (Delhi election results 2025) కొద్ది క్షణాల్లో వెల్లడి కానున్నాయి. మొత్తం ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఓట్ల లెక్కింపు ఉదయం ఎన్ని గంటల నుంచి మొదలవుతుంది.. అధికారులు 19 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.. ఓట్ల లెక్కింపును ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి (CEO) కార్యాలయం స్వయంగా పర్యవేక్షిస్తున్నది. ఎన్నికల ఫలితాలలో భాగంగా ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలవుతుంది. అయితే ఉదయం తొమ్మిది తర్వాత ఓట్ల లెక్కింపు తొలి ట్రెండ్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇక్కడే ముందు
ఢిల్లీ అసెంబ్లీలో కాంట్ నియోజకవర్గం ఫలితాలు ముందుగానే వచ్చే అవకాశం ఉంది. ఈ స్థానంలో కేవలం 78,000 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 59.36 శాతం ఓటింగ్ నమోదయింది. వికాస్ పూరి ప్రాంతంలో ఫలితాలు ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ 4.56 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ లెక్కింపు కాస్త ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. ఢిల్లీ ఎన్నికల్లో ఈసారి 699 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు..
భారీగా పోలీసుల మోహరింపు
ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఎన్నికల జరిగాయి. మొత్తం 13 వేలకు పైగా పోలింగ్ బూత్ లలో ఓటింగ్ జరిగింది. మొత్తంగా 60.54% పోలింగ్ నమోదయింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల ఫలితాలు మధ్యాహ్నం రెండు గంటల వరకే ఒక అంచనాకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీలోని మొత్తం 11 జిల్లాల్లో నిర్మించిన 70 స్ట్రాంగ్ రూములలో ఈవీఎం లను భద్రపరిచారు. వీటి భద్రతను 30 వేల మంది పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.. సీసీ టీవీలను ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద సూపర్వైజర్లు, మైక్రో అబ్జర్వర్లు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.. స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంలను బయటకు తీసుకురావడం దగ్గరనుంచి ఓట్ల లెక్కింపు వరకు ఈ ప్రక్రియను మొత్తం వీడియోగ్రఫీ చేస్తున్నారు. లెక్కింపు ప్రక్రియలో మొత్తం 5000 మంది ఉద్యోగులు పాలుపంచుకుంటున్నారు.. లెక్కింపును పర్యవేక్షించే అధికారులు, సహాయ అధికారులు, సూక్ష్మ పరిశీలకులు, గణాంక సిబ్బంది, ఇతర సిబ్బంది ఈ విధంలో పాల్గొంటున్నారు.. అయితే కౌంటింగ్ సిబ్బంది ప్రతి నియోజకవర్గంలో 5 VVPAT యంత్రాల స్లిప్పులు లెక్కిస్తారు. దీనివల్ల ఎలాంటి అంతరాయం లేకుండానే పోలింగ్ ఫలితాలను స్పష్టంగా అంచనా వేయడానికి అవకాశం ఉంటుందని తెలుస్తోంది.