Today Horoscope In Telugu: ద్వాదశ రాశులపై బుధవారం పూర్వాషాడ ఉత్తరాషాడ నక్షత్రాల ప్రభావం ఉంటుంది.ఈ రోజు అమావాస్య ఉండనుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఆర్థికంగా జోష్ పెరగనుంది. మరికొన్ని రాశుల వారు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. పూర్వీకుల ఆస్తిపై శుభవార్త వింటారు. ఉద్యోగులకు పై అధికారుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. ప్రమోషన్లు పొందే అవకాశం కూడా ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులకు అనుకొని తన సహాయం అందుతుంది.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : అమావాస్యవేళ ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆహారపు అలవాట్ల విషయంలో శ్రద్ధ వహించాలి. నాణ్యమైన ఆహారం తీసుకోకపోతే అనారోగ్యం పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. పిల్లలనుంచి శుభవార్త వింటారు. దూర ప్రయాణం చేయాలని అనుకుంటే వాయిదా వేసుకోవడం మంచిది.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వ్యాపారాలు కొత్త ఒప్పందాన్ని ఏర్పరచుకుంటారు. అయితే పెద్దల సలహాతో ముందుకు వెళ్లాలి. ప్రణాళిక ప్రకారంగా ఉద్యోగులు కొన్ని పనులు పూర్తి చేస్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కొన్ని సమస్యల పరిష్కార కోసం కొన్నాళ్లపాటు వేచి ఉండాలి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు ఆర్థికంగా నష్టాన్ని ఎదుర్కొంటారు. స్టాక్ మార్కెట్లో డబ్బు పెట్టాల్సి వస్తే వాయిదా వేసుకోవడం మంచిది. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రాలకు వెళ్తారు. పిల్లలతో సంతోషంగా ఉంటారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : సింహరాశి వారికి అమావాస్యవేళ అనుకూల ఫలితాలు ఉండనున్నాయి. మీరు ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. కొందరు ధన సహాయం చేస్తారు. పాత స్నేహితులను కలవడం వల్ల ఉల్లాసంగా ఉంటారు. పెండింగ్ పనులను పూర్తి చేసుకుంటారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : కన్యా రాశి వారు రాజకీయ నాయకులు అయితే వీరికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. పెండింగ్ లో ఉన్న ఆస్తి వివాదాలు సమసిపోతాయి. ప్రయాణాలు చేయాలనుకుంటే జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : తులా రాశి వ్యాపారులకు ఈరోజు మంచి లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే వెనుకడుగు వేయడం మంచిది. ఎందుకంటే ఇవి తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. జీవిత భాగస్వామితో కలిసి పర్యటనలు చేస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. ఒక పనిని పూర్తి చేయడానికి తెగ చూపిస్తారు. కచ్చితంగా ఉంటూ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. మానసికంగా ఆందోళనలతో ఉంటారు. అయితే పాత స్నేహితులను కలవడం వల్ల కాస్త రిలీఫ్ అవుతారు.
ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాల్లో గోపి అన్ని పాటించాలి. పిల్లలనుంచి శుభవార్తలు వింటారు. కొందరికి ధన సహాయం చేయడం వల్ల తిరిగి ఇవ్వలేక పోతారు. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు ఉంటుంది. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : మీ రాశి వారు ఆర్థికంగా పుంజుకుంటారు. అమావాస్యవేళ వీరికి కలిసి వస్తుంది. ఉద్యోగులు తోటి వారితో స్నేహంగా ఉంటారు. అయితే చేసే పని పట్ల శ్రద్ధ వహించాలి. వ్యాపారులు లాభాలు పొందేందుకు మార్గాలు ఏర్పడతాయి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఏదైనా ఆస్తికి సంబంధించిన కొత్త విషయాలు తెలుసుకుంటారు. తాకు మార్కెట్లో డబ్బు పెట్టాల్సి వస్తే భవిష్యత్తులో ఇవి లాభాలు ఉంటాయి. ఉద్యోగులు అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : అమావాస్య వేల మీన రాశి వారికి ఇబ్బందులు ఎదుర్కొని అవకాశం ఉంది. ఖర్చుల విషయంలో వెనుకడుగు వేయాలి. లేకుంటే ఆర్థికంగా నష్టపోతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుంటారు.