Ind Vs Eng 3rd T20: వరుస విజయాలు.. 5 t20 సిరీస్ లు.. ఇదీ గత ఏడాది నుంచి టీమిండియా టి20 చరిత్ర. కానీ ఏకపక్ష విజయాలు సాధిస్తున్న టీమ్ ఇండియాకు.. స్వదేశంలో ఇంగ్లాండ్ జట్టు ఒక్కసారిగా ఝలక్ ఇచ్చింది. మిస్టీరియస్ స్పిన్ బౌలర్ వరుణ్ చక్రవర్తి (5/24) తో ఆకట్టుకున్నప్పటికీ.. బ్యాటింగ్ వైఫల్యం వల్ల భారత జట్టు విజయానికి దూరంగా జరిగింది. ఇక గెలవాల్సిన మ్యాచ్లో.. నిలబడి ఇంగ్లాండ్ జట్టు అదరగొట్టింది.. అయితే భారత్ జట్టు ఓడిన రెండుసార్లు కూడా ఐదు వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్ గా వరుణ్ చక్రవర్తి నిలిచాడు.
రాజ్ కోట్ వేదికగా జరిగిన మూడో టి20 మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది. గెలవాల్సిన మ్యాచ్లో.. దృఢంగా నిలబడి సత్తా చాటింది. టీమ్ ఇండియా స్క్రీన్ బౌలర్ వరుణ్ చక్రవర్తి 5/24 తో ఆకట్టుకున్నప్పటికీ భారత జట్టు గెలవలేకపోయింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో సత్తా చాటి ఇంగ్లాండ్ జట్టు అదరగొట్టింది.. తీవ్ర ఒత్తిడిలో జరిగిన ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు అన్ని రంగాలలో సత్తా చాటింది. మొత్తానికి 26 పరుగులతో విజయాన్ని అందుకుంది. తద్వారా ఈ సిరీస్లో 2-1 తేడాతో ముందడుగు వేసింది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్ల పాటు ఆడి తొమ్మిది వికెట్లకు 171 పరుగులు చేసింది. డకెట్ 28 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 51 పరుగులు చేశాడు. లివింగ్ స్టోన్ 24 బంతుల్లో ఒక ఫోర్, ఐదు సిక్సర్లతో 43 పరుగులు చేసి విధ్వంసాన్ని సృష్టించాడు.. బట్లర్ 24 పరుగులతో ఆకట్టుకున్నాడు. హార్దిక్ పటేల్ రెండు వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఇక ఈ టార్గెట్ ఫినిష్ చేయడంలో భారత్ తడబడింది. చివరి వరకు ఆడినప్పటికీ 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్దిక్ పాండ్యా 40, అభిషేక్ శర్మ 24 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. ఓవర్టన్ మూడు టికెట్లు పడగొట్టాడు. కార్స్, ఆర్చర్ చెరి రెండు వికెట్లు దక్కించుకున్నారు. డకెట్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది.. అర్ష్ దీప్ సింగ్ కు విశ్రాంతి ఇచ్చిన టీమ్ ఇండియా మేనేజ్మెంట్..పేస్ బౌలర్ షమీకి అవకాశం ఇచ్చింది. ఇక ఈ రెండు జట్ల మధ్య మూడో మ్యాచ్ ఈనెల 31న పూణేలో జరుగుతుంది.
బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు
టార్గెట్ మాములుదే అయినప్పటికీ.. లక్ష్యాన్ని చేదించడంలో భారత బాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఒక దశలో హార్దిక్ పాండ్యా ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. అతడు గరిష్ట వేగాన్ని అందుకోవడంలో విఫలమయ్యాడు.. షార్ట్ పిచ్ బంతులను ఆడటంలో విఫలమవుతున్న సంజు శాంసన్(3).. ఈ మ్యాచ్ లోనూ అదే పునరావృతం చేశాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (14) వేగంగానే ఆడినప్పటికీ వెంటనే అవుట్ అయ్యాడు. సూర్య కుమార్ యాదవ్ కూడా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. దీంతో కీలక దశలోనే మూడు వికెట్లు కోల్పోవడంతో భారత్ పై ఒత్తిడి పెరిగింది. ఈ దశలో తిలక్ వర్మ (18) కూడా వెంటనే అవుట్ కావడంతో టీమిండియా కు కష్టాలు మరింత పెరిగాయి. స్పిన్నర్ రషీద్ బౌలింగ్లో తిలక్వర్మ క్లీన్ బౌడ్ అయ్యాడు. ఇక సుందర్ కూడా (6) త్వరగానే అవుట్ కావడంతో హార్దిక్ పాండ్యా పై భారం పెరిగింది. అయితే హార్దిక్ పాండ్యాను అవుట్ చేయడానికి ఇంగ్లాండ్ జట్టు రెండుసార్లు రివ్యూలకు వెళ్లిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక అక్షర్ పటేల్ (15) తో కలిసి హార్దిక్ పాండ్యా ఆరో వికెట్ కు 38 పరుగులు జోడించాడు. చివరి దశలో భారత విజయానికి 12 బంతుల్లో 41 పరుగులు అవసరం కావలసిన సందర్భంలో.. హార్దిక్ పాండ్యా లాంగ్ ఆఫ్ లో క్యాచ్ ఇవ్వడంతో భారత్ ఆశలు దాదాపుగా అడుగంటిపోయాయి. ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టు మ్యాచ్ పై మరింత పట్టు బిగించి దర్జాగా విజయం సాధించింది.
వారిద్దరూ ఆదుకున్నారు
వరుసగా మూడో మ్యాచ్లోనూ ఇంగ్లాండ్ జట్టు టాస్ ఓడిపోవడం విశేషం. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా.. ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ కు దిగింది. ఇంగ్లాండ్ ఓపెనర్ డకెట్, చివర్లో లివింగ్ స్టోన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఈ దశలో వరుణ్ చక్రవర్తి మిస్టీరియస్ బంతులు వేయడంతో ఐదుగురు ఇంగ్లాండ్ బ్యాటర్లు అవుతారు. ఓపెనర్ సాల్ట్(5) వికెట్ ను హార్దిక్ పాండ్యా పడగొట్టాడు. ఈ దశలో బట్లర్, డకెట్ అదరగొట్టారు. షమీ బౌలింగ్లో సిక్స్ కొట్టిన డకెట్.. హార్దిక్ పాండ్యా వేసిన ఓవర్ లో వరుసగా మూడుఫోర్లు కొట్టాడు.. ఇక ఐదో ఓవర్లో 4,4,6 తో 15 పరుగులు రాబట్టాడు. అటు బట్లర్ కూడా ఏడో ఓవర్లో 4, 6 కొట్టడంతో 200 స్కోర్ సాధ్యమని అందరూ అనుకున్నారు. కానీ వరుణ్ రాకతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది.. 26 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన డకెట్ అక్షర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. స్మిత్ (6), ఓవర్టన్(0) ను వరుస బంతుల్లో వరుణ్ వెనక్కి పంపించాడు. కార్స్ (3), ఆర్చర్ (0) ను అవుట్ చేసి.. 5 వికెట్ల ఘనతను సొంతం చేసుకున్నాడు.. అయితే 16 ఓవర్లలో 127/8 వద్ద ఇలాంటి ఉన్నప్పుడు.. లివింగ్ స్టోన్ 17 ఓవర్లో మూడు సిక్సర్లు కొట్టి 13 పరుగులు చేశాడు. అయితే చివరి రెండు ఓవర్లలో ఇంగ్లాండ్ జట్టు 20 పరుగులు చేయడంతో.. 170 పరుగులు చేయగలిగింది.