Father : పిల్లలు అనే పదం వింటే చాలు మనకు గుర్తుకు వచ్చే వాళ్ళు అమ్మ, నాన్న. ఈ ప్రపంచం పిల్లల విషయం లో తల్లికి మొదటి స్థానం ఇస్తే, నాన్నకి రెండవ స్థానం ఇచ్చింది. ఈ లోటును వేరే ఎవరు భర్తీ చేయలేరు. తండ్రి విషయనికి వస్తే నాన్నలేని జీవితం పెద్ద సవాల్.ఇక జీవితంలో తండ్రికి చాలా ప్రాముఖ్యత ఉంది. అతను కుటుంబానికి మూలస్తంభం మాత్రమే కాదు. తన పిల్లలకు మార్గదర్శకుడు, సంరక్షకుడు, ప్రేమను పంచేవాడు. ఒక కుటుంబం నుంచి తండ్రి నీడ అదృష్యమైనప్పుడు, అనేక పెద్ద సవాళ్లు ఎదురవుతాయి.
తండ్రి లేని లోటులో వచ్చే కష్టాలు, లోపాలు?
1.కుటుంబానికి ఆర్థిక అవసరాలకు ప్రధాన వనరు తండ్రి.
ఇంటి యజమానిగా తండ్రి లేనివారికి ఇంటిని నిర్వహించే బాధ్యత కుటుంబంలోని ఇతర సభ్యులపై, ముఖ్యంగా తల్లి లేదా పెద్ద పిల్లలపై పడుతుంది. పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, ఇతర అవసరాలు తీర్చడం పెద్ద భారంగా మారుతుంది.
2. భావోద్వేగ మద్దతు కోల్పోవడం:
తండ్రి ఆర్థికంగా మాత్రమే కాదు, కుటుంబానికి మానసిక మద్దతు కూడా. అతని ఉనికి పిల్లలకు ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. అతని లేకపోతే ఆ తరువాత, కుటుంబంలో శూన్యత, అభద్రతా భావం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
3. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది:
కుటుంబంనికి సంబందించిన చిన్న చిన్న విషయాలలో, పెద్ద నిర్ణయాలలో తండ్రి అనుభవం, సలహాలు, సూచనలు ఎంతో సహాయపడుతాయి. అవి లేకుండా, కొన్నిసార్లు సరైన నిర్ణయం తీసుకోకపోవడం వలన కష్టనష్టాలు ఎదురవుతాయి. పిల్లలు ముఖ్యంగా తమ విద్య, వృత్తిలో కన్నా కలలు నెరవేరాక జీవితంలో కీలక నిర్ణయలు తీసుకోలేని జ్ఞానం కోల్పోయే అవకాశం ఉంది.
4. సామాజిక ఒత్తిడి కారణంగా అభద్రత భావం:
తండ్రి లేకపోవడం వల్ల సమాజంలో బలహీనమైన పరిస్థితి ఏర్పడుతుంది. సానుభూతి పేరుతో ప్రజలు ఒత్తిడి తెస్తారు. అలాంటి సమయంలో చాలాసార్లు కుటుంబం ఇతరుల సహాయంపై ఆధారపడవలసి వస్తుంది.
5. నైతిక మద్దతు లేకపోవడం:
తండ్రులు తమ పిల్లలకు రోల్ మోడల్. అతని జీవితం పోరాటం, విజయ కథలు పిల్లలకు స్ఫూర్తినిస్తాయి. వాళ్లు లేకుంటే కష్టకాలంలో ముందుకు సాగే ధైర్యాన్ని ఇచ్చే స్ఫూర్తి పిల్లలకు లభించదు. పిల్లల బంగారు భవిష్యత్తుకు, వారి మంచి, చెడు విషయంలో తండ్రి తోడు ఎంతో అవసరం. ఆ బాధ లేని వారికే తెలుసు.