Rajamouli : ప్రస్తుతం రాజమౌళి (Rajamouli) మహేష్ బాబు (Mahesh Babu) తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన ప్రఖ్యాత దర్శకుల పక్కన అతని పేరును నిలుపుకోవాలనే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తోంది…ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా రాజమౌళి స్నేహితుడు అంటూ యు శ్రీనివాసరావు అనే వ్యక్తి రాజమౌళిని ఉద్దేశిస్తూ కొన్ని కామెంట్స్ అయితే చేశాడు. శ్రీనివాసరావు(Srinivasa Rao) రాజమౌళి ఇద్దరు కలిసి ఒక అమ్మాయిని లవ్ చేశారని వీళ్లది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని శ్రీనివాసరావు చెప్పాడు. ఇక రాజమౌళి కోసం తన ప్రేమను త్యాగం చేశానంటూ ఆయన్ చెప్పడమే కాకుండా మాది ఆర్య 2 లవ్ స్టోరీ అంటూ చెబుతూ వచ్చాడు. ఇక రాజమౌళికి చాలా సన్నిహితుడునని అంటూ కూడా చెప్పడం విశేషం… అయితే ఇదంతా శాంతి నివాసం(Shanthi Nivasam) సీరియల్ కి ముందు జరిగిన స్టోరీ అని కూడా చెప్పాడు. అప్పుడు మాకు అంత మెచ్యూరిటీ లేదు దానివల్ల ఏం చేస్తున్నామో కూడా క్లారిటీ లేకుండా పోయిందని చెప్పాడు. ఇక దాంతోపాటుగా ఇప్పుడు ఆయన దర్శకుడిగా మారి ఆ స్టోరీనే సినిమాగా చేయాలనుకుంటున్నాను అని రాజమౌళితో చెప్పాడట..దానికి రాజమౌళి ఒప్పుకోకపోగా ఆయన తనను టార్చర్ పెట్టాడు అంటూ కొన్ని కామెంట్స్ అయితే చేశాడు.
Also Read : ఆ ఒక్కటి రాజమౌళి ఒక్కడికే ఎందుకు సాధ్యం అవుతుంది… మిగతా దర్శకులు ఎందుకు చేయలేకపోతున్నారు..?
ఇక దీని మీద కొంతమంది స్పందిస్తూ యు శ్రీనివాసరావు అనే వ్యక్తికి మతిస్థిమితం సరిగ్గా లేదని దానివల్లే రాజమౌళి మీద అలాంటి కామెంట్స్ చేస్తున్నాడని దాదాపు 35 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీని ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏముంది? రాజమౌళిని బ్లాక్ మెయిల్ చేయడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అంటూ కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు.
మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి ఇమేజ్ టాప్ లెవల్లో ఉంది కాబట్టి తనను వాడుకొని ఆయన కూడా ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతోనే అలాంటి కామెంట్స్ చేస్తున్నాడు అంటూ మరి కొంతమంది వాళ్ల అభిప్రాయాలను తెలియజేయడం విశేషం… ఇక ఈయన మాట్లాడిన మాటల్లో నిజం లేదనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది.
అయిన ఎప్పుడో 35 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీని ఇప్పుడు ఎందుకు తెరమీదకి తీసుకొచ్చారు ఇన్ని రోజుల నుంచి ఏం చేశారు రాజమౌళి ప్రపంచంలోనే స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకోవాలనుకుంటున్న సందర్భంలో ఆయన మీద కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఈ విషయం ఎక్కడిదాకా వెళ్తుంది. రాజమౌళి దీని మీద ఎలాంటి స్పందన తెలియజేస్తాడనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి…
Also Read : వివాదంలో చిక్కుకున్న రాజమౌళి.. టార్చర్ భరించలేక చనిపోతాను అంటూ స్నేహితుడు కామెంట్స్.. వైరల్ అవుతున్న వీడియో!