Today Horoscope In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశరాశులపై మూలా నక్షత్ర ప్రభావం ఉంటుంది ఇదే రోజు వజ్ర యోగం ఏర్పడడంతో కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. మరి కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల పలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వారు కొత్త ఉద్యోగాలు పొందుతారు. జీవిత భాగస్వామితో విభేదాలు ఉంటే నేటితో పరిష్కారం అవుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపారులకు ఆర్థికంగా బాగుంటుంది. కొత్త స్నేహంతో ఉల్లాసంగా ఉంటారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆస్తి కొనుగోలు విషయంలో మార్గం ఏర్పడుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి మంచి సమయం. జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉంటుంది. ఆర్థికంగా కొన్ని చిక్కులు ఎదుర్కొంటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు మిశ్రమ ఫలితాలు పొందుతారు. విదేశాలతో వ్యాపారం చేసేవారు అత్యధిక లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు ఖర్చు ఎక్కువగా అవుతుంది. సాధ్యమైనంతవరకు అవసరం ఉన్న వరకే ఖర్చు పెట్టాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు వస్తాయి. మాటలను అదుపులో ఉంచుకోవాలి. కొత్త వ్యక్తులతో వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం స్నేహితులను కలుస్తారు. కుటుంబ సభ్యులకు పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి పూర్తి మద్దతు ఉంటుంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు మాటలను అదుపులో ఉంచుకోవాలి. అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. వ్యాపారాలను ఇబ్బంది పెట్టడానికి కొందరు ప్రయత్నిస్తారు. కొత్త పెట్టుబడుల కోసం పెద్దల సలహా తీసుకోవాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాను పొందుతారు. ఉద్యోగులకు కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులు మానసికంగా ఒత్తిడితో ఉంటారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : విహారయాత్రలకు వెళ్లాల్సి వస్తే. మీ ప్రవర్తన వల్ల కుటుంబ సభ్యులు మాట్లాడడం తగ్గిస్తారు. వాహనాలను ఇతరులకు ఇవ్వకుండా ఉండడమే మంచిది. వాహనాలపై ప్రయాణం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దల సలహా తీసుకోవాలి. విదేశాల్లో ఉండే వారి నుంచి శుభవార్తలు వింటారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి నిరాహారయాత్రలకు వెళ్తారు. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. కురుపు చేసి మార్గాన్ని వెతుక్కోవాలి. నిరుద్యోగులకు అదనపు ఆలయం అందుతుంది. పెట్టుబడును పెట్టేందుకు ఇదే అనుకూల సమయం.
ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : వివాహ ప్రతిపాదనని వస్తాయి. కొందరు ఉద్యోగం ఆష చూపి మోసం చేసే ఆకాశం ఉంది. పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగులు అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తే ఖర్చులు ఉంటాయి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : మనసులో ప్రతికూల ఆలోచనలు నియంత్రించాలి. ఏదైనా అనారోగ్యానికి గురైతే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యపై ప్రత్యేక వహించాలి. సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఉద్యోగులు కార్యాలయాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటారు. కొందరు అధికారులు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : వ్యాపారులకు మంచి లాభాలు ఉంటాయి. సోదరుల మద్దతుతో కొత్త పెట్టుబడులు పెడతారు. జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ప్రణాళిక వేస్తారు. పిల్లల కెరీర్ పై శ్రద్ధ వహిస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసేవారు వాయిదా వేసుకోవడం మంచిది.