Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశరాశుల పై జేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజు ధ్రువయోగం కారణంగా కొన్ని రాశులపై శని దేవుడి అనుగ్రహం ఉండనుంది. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాసిన ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వ్యాపారాలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఉపాధి కోసం చూస్తున్న వారు శుభవార్త వింటారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి. జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉండే అవకాశం. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. అయితే ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : వ్యాపారులు కొత్తపెట్టబడులు పెడతారు. కొందరు శత్రువులు ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తారు. అందువల్ల కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. దీంతో పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది. సాయంత్రం ప్రయాణాలు చేస్తారు. కొంత డబ్బును ఖర్చులకోసం ఉపయోగిస్తారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి ఉద్యోగులకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అదనపు ఆదాయం రావడంతో ఉల్లాసంగా ఉంటారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉంటుంది. దీంతో మనసు ఆందోళనగా ఉంటుంది. ఆర్థికపరంగా పుంజుకుంటారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : కుటుంబ సభ్యులకు కోసం ప్రత్యేకంగా పనిచేస్తారు. కొన్ని పనులు నిమిత్తం బిజీగా ఉంటారు. ఓ సమస్య పరిష్కారం కోసం తీవ్రంగా కృషి చేస్తారు. ప్రియమైన వారితో జాగ్రత్తగా ఉండాలి. అవసర మాటలతో వారి మనసు నచ్చుకొని ఉండవచ్చు. వ్యాపారంలో కొత్త ప్రణాళికలు చేపడుతారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : కొత్తగా పెట్టుబడిలో పెట్టాలనుకునే వారు తండ్రి సలహా తీసుకోవాలి. కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వివాదపు అంశాలకు దూరంగా ఉండాలి. వైద్య అవసరం పడితే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్రంగా నష్టపోతారు. కొన్ని చి క్కులు ఎదురవుతాయి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : వ్యాపారులకు అనుకూల సమయం. బంధువుల నుంచి తన సహాయం అందుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉంటుంది. జీవిత భాగస్వామితో వ్యాపారం చేయడానికి ప్రయత్నిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. తల్లిదండ్రుల ఆశీస్సులతో వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఇన్నాళ్లు అనుకుంటున్నా ఒక కోరిక నెరవేరుతుంది. పిల్లలనుంచి శుభవార్తలు వింటారు. చట్టపరమైన చిక్కుల్లో ఉంటే ఆ సమస్య నేటితో పరిష్కారం అవుతుంది. ప్రభుత్వ పథకాలు ప్రయోజనంగా ఉంటాయి. వ్యాపారులకు ఊహించని లాభాలు వస్తాయి. జీవిత భాగస్వామితో వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంటారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి. పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగులు కార్యాలయాల్లో తమ ప్రతిభను నిరూపించడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. జీవిత భాగస్వామి కోసం ఖర్చులు చేస్తారు. అయితే దుబారా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారి మనసు ఈ రోజు ఉల్లాసంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉంటారు. వ్యాపారులకు జీవిత భాగస్వామి పూర్తి మద్దతు ఉంటుంది. ఎవరైనా ఆర్థిక లావాదేవీలు చేయాల్సి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పక్కన ఉండే వారే మోసం చేసే అవకాశం ఉంటుంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : కొన్ని వివాదాల్లో చిక్కుకుంటారు. ఉద్యోగులు అతను ఆదాయాన్ని పొందుతారు. బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలనుకునే వారికి ఈరోజు అనుకూల సమయం. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడంతో వ్యాపారులు ఉల్లాసంగా ఉంటారు. ఊహించిన దానికంటే ధన లాభం ఎక్కువగానే ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతుతో కొత్త పెట్టుబడులు పెడతారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : కొన్ని పనులు పూర్తి చేయడానికి తొందర పడతారు. ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగులు కార్యాలయాల్లో చేసే పనులతో మనసు ఒత్తిడిగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే అపజయం వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారులు లాభాలను అర్ధించడానికి తీవ్రంగా కష్టపడతారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వ్యాపారులు నిరాశతో ఉంటారు. ఉద్యోగులకు సమస్యలు ఎక్కువగా ఉండటంతో ఆందోళన చెందుతారు. అయితే కొందరికి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఓ విషయంపై కీలక నిర్ణయం తీసుకుంటారు. వివాహితులకు పెళ్లి ప్రతిపాదనలు వస్తాయి. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.