https://oktelugu.com/

Rajamouli and Mahesh Babu : మహేష్ బాబు పాస్ పోర్ట్ ని లాగేసుకున్న రాజమౌళి..వైరల్ అవుతున్న లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్!

అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

Written By: , Updated On : January 25, 2025 / 07:48 AM IST
Rajamouli , Mahesh Babu

Rajamouli , Mahesh Babu

Follow us on

Rajamouli and Mahesh Babu : అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే రెండేళ్ల సమయం తీసుకున్న రాజమౌళి , గత ఆరు నెలల నుండి హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో వర్క్ షాప్స్ నిర్వహిస్తున్నాడు. అనేకమంది ఆర్టిస్టులతో ఆయన రిహార్సల్స్ చేయిస్తున్నాడు. అదే విధంగా మహేష్ బాబు కూడా ఈ చిత్రం కోసం సరికొత్త లుక్ లోకి మారి, మార్షల్ ఆర్ట్స్ వంటివి ప్రత్యేకంగా నేర్చుకున్నాడు. అంతే కాకుండా ఆఫ్రికన్ కోయ బాషాలో కూడా ఆయన ట్రైనింగ్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అన్ని విధాలుగా మహేష్ బాబు సిద్ధం అవ్వడంతో ఈ సినిమాకి సంబంధించిన పూజ కార్యక్రమాలు రీసెంట్ గానే హైదరాబాద్ లో ప్రారంభించారు. ఈ పూజ కార్యక్రమాలకు సంబంధించి ఒక్కటంటే ఒక్క ఫోటో కూడా బయటకి రాకపోవడం గమనార్హం.

అంత గోప్యంగా ఈ సినిమాకి సంబంధించి మూవీ టీం వ్యవహరిస్తున్నప్పటికీ సోషల్ మీడియా లో లీక్ అయిపోతున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటించనుంది, ఆమె రీసెంట్ గానే హైదరాబాద్ లో జరుగుతున్న వర్క్ షాప్ లో పాల్గొనిండి. ఆమెకి సంబంధించిన లుక్ టెస్ట్ కూడా జరిగింది. అంత ఫైనల్ అయిపోయాక రాజమౌళి ఆమెని రెండేళ్ల కాల్ షీట్స్ ని అడిగాడట. అందుకు ప్రియాంక చోప్రా ఒప్పుకుంటుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇదంతా గోప్యంగా ఉండేందుకు మూవీ టీం అనేక జాగ్రత్తలు తీసుకుంది కానీ, సోషల్ మీడియా లో లీక్ అయ్యాయి. ఇదంతా పక్కన పెడితే నిన్న రాజమౌళి ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్ తెగ వైరల్ గా మారింది. మహేష్ బాబు నుండి పాస్ పోర్ట్ లాక్కున్నట్టు అర్థం వచ్చేలా ఒక వీడియో ని వదిలాడు. సింహం ని బోన్ లో వేసినట్టు చూపించాడు.

మహేష్ బాబు ఖాళీ సమయం దొరికితే తన కుటుంబం తో కలిసి విదేశాలకు పయనమయ్యే సంగతి తెలిసిందే. ఇక సెలవులు లేవు అంటూ రాజమౌళి సింబాలిక్ గా ఈ వీడియో ని అప్లోడ్ చేసాడు. దీనికి అభిమానుల నుండి చాలా ఫన్నీ రియాక్షన్స్ వచ్చాయి. మహేష్ బాబు ని ట్యాగ్ చేస్తూ ఎంత కష్టమొచ్చింది అన్నా అంటూ ట్వీట్లు వేస్తున్నారు. అంతే కాకుండా పాస్ పోర్ట్ లేకుండా విదేశాలకు వెళ్లడం ఎలా అనే ట్రిక్స్ సంబంధించిన యూట్యూబ్ వీడియో ని ఇంస్టాగ్రామ్ లో ఒక అభిమాని మహేష్ బాబు కి పంపుతూ దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ని సోషల్ మీడియా లో అప్లోడ్ చేసాడు. ఇది చాలా వైరల్ అయ్యింది. ఇలాంటి కామెడీ పోస్టులు నిన్న చాలానే పడ్డాయి. మొదటి రోజే వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టబోతున్న సినిమా అంటూ అభిమానులు ఎలివేషన్స్ వేసుకుంటున్నారు.