Today Horoscope In Telugu
Today Horoscope In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశరాసులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజు గురుడు అంగారకుడు ఒకే స్థానంలో సంచారం చేస్తారు దీంతో కొన్ని రాశుల వారు ఎన్నడూ ఎరగని లాభాలు పొందుతారు. మరొక అన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మీషంతో సహా మీనం వరకు మొత్తం రాసిన ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వారికి ఈ రోజు ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రంగానే సాగిన లాభాలు అధికంగానే ఉంటాయి. కొన్ని పనుల కారణంగా నిరాశతో ఉంటారు. దీంతో కొత్త పనిని ప్రారంభించేందుకు ఉత్సాహం చూపరు. ప్రభుత్వ ఉద్యోగులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఉంటే ఇబ్బందులు ఎదురవుతాయి. అందువల్ల ఎప్పటికప్పుడు నైపుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి. కొత్త భాగస్వాములను చేర్చుకోవడం ద్వారా వ్యాపార అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): కష్టపడి పనిచేసిన వారికి సరైన ఫలితాలు ఉంటాయి. కొన్ని పనులు రిస్క్ తో ఉంటాయి. అయినా వెనుకడుగు వేయొద్దు. మానసికంగా దృఢంగా ఉండడానికి ఆరోగ్య సాధనాలు చేయాలి. భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని వ్యాపారాలు కొత్త పెట్టుబడులు పెడతారు. ఆరోగ్యం పై నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవాలి. లేకుంటే ఆరోగ్యం పై ప్రభావం పడే అవకాశం ఉంది. వ్యాపార వ్యవహారాలను చక్కబెట్టుకుంటారు. ఉద్యోగులకు సీనియర్ల నుంచి మద్దతు లభిస్తుంది. లక్ష్యాలను ఏర్పరచుకొని వాటికోసం కష్టపడతారు. బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు మాటలను అదుపులో ఉంచుకోవాలి. అనవసరపు వివాదాల్లో తల దూర్చడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చిన వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. అదనపు ఆదాయం కోసం చూసే ఉద్యోగులు శుభవార్త వింటారు. పెండింగ్ పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : వ్యాపారులకు ప్రత్యేక లాభాలు వస్తాయి. ఉద్యోగులు తమ విధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కాస్త నిర్లక్ష్యంగా ఉంటే సీనియర్ల నుంచి వేధింపులు ఎదుర్కోవాల్సి వస్తుంది. డబ్బుతో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇదే మంచి సమయం. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్త వింటారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టు కోసం కొత్త వ్యక్తుడు కలుస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. అయితే మాటలను అదుపులో ఉంచుకోవాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు ఉంటాయి. సమీపంలో ఉండే వ్యక్తితో కొత్త ఒప్పందం చేసుకుంటారు. ఆర్థికపరమైన ఫలితాలు పొందుతారు. నాణ్యమైన ఆహారం తీసుకోవాలి. లేకుంటే ఆరోగ్యం పై ప్రభావం పడే అవకాశం ఉంది.
ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : వ్యాపారులు గందరగోల పరిస్థితిలో పడతారు. లాభాల కంటే నష్టాలు ఎక్కువ వస్తాయి. అయితే వెనుకడుగు వేయకుండా ముందుకు సాగడం వల్ల కచ్చితంగా యధాస్థితికి వస్తారు. కొందరి వద్ద ఈ రాశి వారి డబ్బు చిక్కుకుపోతుంది. అందువల్ల ధన సహాయం చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వ్యాపారులు మెరుగైన ఆర్థికపరాలు పొందుతారు. దీంతో మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. రాజకీయ నాయకులకు సమాజంలో గౌరవం లభిస్తుంది. పెద్దల సలహా మేరకు కోపాన్ని అదుపులో పెట్టుకుంటారు. అయినా మధ్యాహ్నం నుంచి కొన్ని గొడవల్లో తలదూర్చే అవకాశం ఉంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఆరోగ్యంపై శ్రద్ధ పెడతారు. కొన్ని సమస్యలను పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల వ్యాపారులు లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామితో కలిసి విహార యాత్రలకు వెళ్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : కొత్త ప్రాజెక్టు చేపట్టాలనుకుంటే పెద్దల తీసుకోవాలి. మరోవైపు ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టు విషయంలో ప్రశంసలు అందుకుంటారు. నిర్ణయాలు తీసుకునే సమయంలో ఎలాంటి తొందరపాటు పడొద్దు. సీనియర్ల అండతో ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేస్తారు.