Kalki 2898 AD : గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ప్రభాస్ ‘కల్కి 2898 AD’ చిత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన కలెక్షన్ల సునామీని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. తెలుగు లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో, హిందీ లో అంతకు మించి హిట్ అయ్యింది. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ క్యారక్టర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. మహాభారతం కి సైన్స్ ఫిక్షన్ ని జోడిస్తూ డైరెక్టర్ నాగ అశ్విన్ తెరకెక్కించిన తీరుకి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 1200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. ఓటీటీ లో కూడా ఇదే రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకొని ఇప్పటికీ అమెజాన్ ప్రైమ్ వీడియో ట్రెండింగ్ అవుతుంది. అయితే ఈ సినిమాని జపాన్ దేశంలో భారీ ఎత్తున విడుదల చేసారు. ప్రభాస్ గతం లో చేసిన ‘సాహూ’, ‘సలార్’ వంటి చిత్రాలు అక్కడి ఆడియన్స్ ని బాగా అలరించడంతో ‘కల్కి’ కూడా సక్సెస్ సాధిస్తుంది అనే నమ్మకంతో మేకర్స్ గ్రాండ్ గా విడుదల చేసారు.
కానీ అక్కడ రెస్పాన్స్ మాత్రం డిజాస్టర్ రేంజ్ లో వచ్చింది. జనవరి 3 వ తారీఖున అత్యధిక థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమాకి ముందుగా ప్రొమోషన్స్ ని #RRR కి చేసిన రేంజ్ లో చేద్దామని అనుకున్నారు మేకర్స్. అందుకు తగ్గట్టుగా ప్లానింగ్స్ ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. కానీ ప్రభాస్ కాళ్లకు గాయం అవ్వడంతో ఆ ప్లానింగ్స్ మొత్తాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అయితే ప్రభాస్ సినిమా కావడం తో అక్కడ ఈ చిత్రానికి మొదటి రోజు 8.9 మిలియన్ యెన్లు ని సొంతం చేసుకుంది. అంటే మన ఇండియన్ కరెన్సీ లెక్కల్లో 53 లక్షల రూపాయిలు అన్నమాట. అయితే మొదటి రోజు వచ్చిన ఈ ఊపుని కొనసాగించడంలో విఫలమైంది కల్కి చిత్రం.
మొదటి వారం ముగిసేసరికి కేవలం కోటి నుండి రెండు కోట్ల రూపాయిల మధ్యలోనే థియేట్రికల్ రన్ ని ముగించుకోవాల్సి వచ్చిందట. వాస్తవానికి ఇలాంటి ఫాంటసీ సినిమాలను అక్కడి ఆడియన్స్ బాగా ఇష్టపడుతారు. అలాంటిది ఈ చిత్రాన్ని ఎందుకు ఇలా రిజెక్ట్ చేసారో అర్థం కావడం లేదంటూ అభిమానులు బాధపడుతున్నారు. అయితే జపాన్ ఆడియన్స్ హీరోయిజం లేని సినిమాలను అంతగా ప్రోత్సహించరు. కల్కి చిత్రం లో హీరో ప్రభాస్ కి పెద్దగా హీరోయిజం ఏమి ఉండదు. కేవలం క్లైమాక్స్ లో మాత్రమే హీరోయిజం ని చూపిస్తాడు డైరెక్టర్. అంతే కాకుండా సినిమా కూడా కాస్త స్లో గా ఉంటుంది. అలా ఉంటే అక్కడి ఆడియన్స్ కి నచ్చదు. అందుకు ఫలితమే ఇది అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇప్పటి వరకు విడుదలైన మన తెలుగు సినిమాలలో #RRR , మగధీర, రంగస్థలం, సలార్ లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.