Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై పూర్వా పాల్గొని నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజు శశి రాజయోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. మరికొన్ని రాశుల వారికి శత్రువుల బెడద తప్పదు. మొత్తం రాసిన ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారులకు ప్రత్యర్థుల బెడద ఉన్న వాటిని అధిగమించి ముందుకు వెళ్తారు. కొత్తగా పెట్టుబడి పెట్టాల్సి వస్తాయి తల్లిదండ్రులు సలహా తీసుకోవడం మంచిది. పిల్లలు పోటీ పరీక్షలో పాల్గొంటే వారికి మద్దతు ఇవ్వాలి. ఆర్థిక వ్యవహారాలు జరిపేవారు కాస్త ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తలు తీసుకోవాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) ఈ రాశి వారు ఏ రోజు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉంటారు. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. కొన్ని పనుల వాళ్ళ సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులు వివిధ వర్గాల నుంచి అధిక లాభాలు పొందుతారు. విద్యార్థులు ఏదైనా పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఉద్యోగులు పదోన్నతులు పొందేందుకు మార్గం ఏర్పడుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు అనుకూల సమయం.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి ఉద్యోగులు ఈరోజు సీనియర్ల నుంచి మద్దతు పొందుతారు. దీంతో కొన్ని లక్ష్యాలు పూర్తి చేయడం వల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి కోసం విలువైన బహువదిని కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో వ్యాపారం చేయాలనుకునే వారికి ఈరోజు అనుకూల సమయం.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : గతంలో పెట్టిన ప్రణాళికలతో వ్యాపారులు ఇప్పుడు అధిక లాభాలు పొందుతారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి దైవ క్షేత్రాలను సందర్శిస్తారు. విహారయాత్రలకు వెళ్లడం ద్వారా మనసు ప్రశాంతంగా మారుతుంది. పాత స్నేహితులను కలిసి ఉల్లాసంగా ఉంటారు. నిర్ణయాలు తీసుకోవడంలో ఎటువంటి తొందరపాటు చర్యలు చేయకూడదు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు రాజకీయాల్లో ఉన్నట్లయితే ఈ రోజు వారు శుభవార్తలు వింటారు. ఆర్థికంగా కొంత నగదు కొరత ఏర్పడుతుంది. ఇదే సమయంలో ఖర్చులు అధికంగా ఉంటాయి. అయితే పొదుపు మాత్రం వాడడం వల్ల కాస్త ఉపశమనం పొందుతారు. వివాహ ప్రయత్నాలు జరుగుతాయి. నాణ్యమైన ఆహారంపై దృష్టి పెట్టాలి. లేకుంటే అనారోగ్యం పాల అయ్యే అవకాశం ఉంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు ఖర్చులు అధికంగా ఉంటాయి. బంధువులతో ఆర్థిక వ్యవహారాలు జరిపేవారు జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసే వారికి అధికంగా లాభాలు వస్తాయి. ఉద్యోగులు తల్లిదండ్రుల కోసం సమయాన్ని కేటాయించడం మంచిది. వారి ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఏ రంగం వారైనా తప్పకుండా విజయం సాధిస్తారు. కొత్తగా ఆదాయ వందనాలు పొందడం వల్ల ఉత్సాహంగా ఉంటారు. గతంలో ఏదైనా వివాదాలు ఉంటే నేటితో పరిష్కారం అవుతాయి. అయితే ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. చిన్న సమస్య ఉన్న వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. ప్రయాణాలు చేసేవారు అనుకువగా ఉండాలి. కొత్త వ్యాపారం గురించి తల్లిదండ్రులతో చర్చిస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : చాలాకాలంగా ప్రింటింగ్ లో ఉన్న పనులు ఈ రాశి వారు ఈ రోజు పూర్తి చేయగలుగుతారు. పాత స్నేహితులు కలవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. అయితే ఖర్చులు ఎక్కువగా ఉండడంతో కాస్త ఆందోళనగా ఉంటుంది. సాయంత్రం కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. బంధువులలో ఒకరి నుంచి దళసహాయం అందుతుంది.
ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే కొందరి నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగులు తోటి వారితో వాగ్వాదాలకు దిగుతారు. అయితే ఇక్కడ కూడా మాటలను అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే ఉద్యోగానికి ప్రభావం పడే అవకాశం ఉంది. వ్యాపారులు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : రోజువారి అవసరాల కోసం ఖర్చులు పెరుగుతాయి. అయినా వ్యాపారులు కు ఆదాయం పెరగడంతో కాస్త ఉపశమనం పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉంటారు. అనుకోకుండా ప్రయాణాలు ఉంటాయి ఇవి లాభాలను తెస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. దైవ క్షేత్రాలు సందర్శించడం వల్ల సంతోషంగా ఉంటారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : కట్టపారమైన చిక్కులు ఉంటే ఈరోజుతో పరిష్కారం అవుతాయి. పూర్వీకుల ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. గతంలో అనారోగ్య సమస్యతో బాధపడితే నేటితో అది మాయమవుతుంది. ఓ విషయం గురించి తీవ్రంగా ఆలోచించడం వల్ల మానసికంగా ఆందోళనలతో ఉంటారు. కొత్తగా పెట్టుబడును పెట్టే వారికి ఇదే మంచి సమయం.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అయితే వాహనాలపై వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. విద్యార్థులు ఏ పోటీ పరీక్షల్లో పాల్గొన్న విజయం సాధించడం తప్పనిసరి. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసేవారు అధికంగా లాభాలు పొందుతారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు వీరితో ఆర్థిక వ్యవహారాలు అప్పుడే జరపకుండా ఉండాలి.