Maruti Wagon R: పండుగలు, ప్రత్యేక రోజుల్లో వస్తువుల సేల్స్ పెంచుకునేందుకు కంపెనీలు భారీ ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి. కానీ ఆటోమోబైల్ రంగంలో మాత్రం సాధారణ రోజుల్లో సైతం కొన్ని కారణాల వల్ల కార్ల ధరలపై తగ్గింపును ప్రకటిస్తారు. ఇలా ఆఫర్లు ప్రకటించేవి సేల్స్ కానివి ఉంటాయని కొందరి అభిప్రాయం. కానీ అత్యధికంగా సేల్స్ నమోదు చేసుకుంటున్న కార్లపై కూడా ఒక్కోసారి ధర తగ్గింపును ప్రకటిస్తాయి. Maruthi Suzuki కంపెనీకి చెందిన ఏ కారు అయినా సేల్స్ లో ముందు ఉంటుంది.వీటిలో Wagan Rగురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దశాబ్దాలుగా ఈ కారును ఎక్కువగా ఆదరిస్తున్నారు. అయినా దీనికి డిమాండ్ తగ్గడం లేదు. అయితే వినియోగదారులను ఆకర్షించేందుకు తాజాగీ ఈ కారుపై భారీగా డిస్కౌంట్ ను ప్రకటించారు. ఇంతకీ కారుపై ఎంత వరకు తగ్గింపు ఉందంటే?
Maruthi Suzuki వ్యాగన్ ఆర్ కారును ఇప్పటికే చాలా మంది సొంతం చేసుకున్నారు. మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అనుగుణంగా ఈ కారు ఉండడంతో పాటు లో బడ్జెట్ లో దీనిని సొంతం చేసుకోవానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా మైలేజ్ కూడా అధికంగా ఉంటుంది. అందుకే ఈ కారు సేల్స్ ఎక్కువగా ఉంటాయి. అయినా ఈ కారు ధరను తగ్గించారు. ప్రస్తుతం మార్కెట్లో వ్యాగన్ ఆర్ రూ.5.54 లక్షల నుంచి రూ.7.33 లక్షల వరకు విక్రయిస్తున్నారు. అయితే దీనిపై రూ.48,100 ను తగ్గించారు. 2024,2025 మోడల్ కార్లపై ఈ తగ్గింపు ఉంటుంది. ఇది ఫిబ్రవరి 28 లోపు మాత్రమేనని కంపెనీ తెలిపింది. ఈ తగ్గింపును పొందాలంటే ఆయా షోరూం డీలర్లను సంప్రదించాలని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
మారుతి సుజుకీ వ్యాగన్ ఆర్ కారులో ఇంజన్, ఫీచర్స్ ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఇందులో హైబ్రిడ్ టెక్నాలజీతో కూిన డ్యూయెల్ జెట్ ఇంజిన్ ను అమర్చారు. ఇది 1.5 లీటర్ కే సిరీస్ తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో పనిచేస్తుంది. ఇది 103 బీహెచ్ పీ పవర్ తో పాటు 137 ఎన్ ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది. ఈ ఇంజిన్ లీటర్ ఇంధనానికి 20.15 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఆటోమేటిక్ వేరియంట్ మాత్రం 19.80 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు.
చిన్న ఫ్యామిలీకి అనుగుణంగా ఉండే ఈ కారులో ఫీచర్ విషయానికొస్తే.. 9 అంగుళాల స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ టచ్ స్క్రీన్ ను అమర్చారు. అలాగే సేప్టీ కోసం 360 డిగ్రీకెమెరాను అమర్చారు. అలాగే ఇందులో వైర్ లెస్ ఛార్జర్, ఆండ్రాయిడ్ ఆటో , ఆపిల్ కార్ ప్లే వంటివి ఆకర్షిస్తాయి. ఇందులో ప్రత్యేకత ఏంటంటే కారు బయటి వ్యూ మొత్తం లోపల స్క్రీన్ పై చూడొచ్చు. మినీ ఎస్ యూవీగా పేర్కొటున్న ఈ కారు ధర తక్కువగా ఉండడమే కాకుండా ప్రస్తుతం తగ్గింపు ధరప్రకటించడంలో చాలా మంది దీనిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.