https://oktelugu.com/

Today Horoscope In Telugu: హోలీ పండుగ వేళ.. ఈ రాశుల వారికి ఊహించని ధన లాభం.. ఆ రెండు రాశుల వారు మాత్రం జాగ్రత్త..

ఈ రాశి వారు గతంలో పెట్టుబడులు పెట్టినట్లయితే ఈరోజు లాభాలు అధికంగా పొందుతారు. తోబుట్టువులకు సంబంధించిన ఆస్తి విషయంలో వివాదాలను పరిష్కరించుకుంటారు.

Written By:
  • Srinivas
  • , Updated On : March 14, 2025 / 08:03 AM IST
    Today Horoscope In Telugu (2)

    Today Horoscope In Telugu (2)

    Follow us on

    Today Horoscope In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై ఉత్తర పాల్గొని నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజు హోలీ పండుగ సందర్భంగా సూర్యుడు, బుధుడి కలయిక ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి కలిసి రానుంది. మరికొన్ని రాశుల వారు ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాసిన ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : . ఈ రాశి వారు గతంలో పెట్టుబడులు పెట్టినట్లయితే ఈరోజు లాభాలు అధికంగా పొందుతారు. తోబుట్టువులకు సంబంధించిన ఆస్తి విషయంలో వివాదాలను పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.. హోలీ పండుగ వేళ ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పెద్దల ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వహించవద్దు. పిల్లల భవిష్యత్తుపై కీలక నిర్ణయాలు వెంటనే తీసుకోవాలి.

    వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : హోలీ పండుగ సందర్భంగా ఈ రాశి వారు మిశ్రమ ఫలితాలను ఎదుర్కొంటారు. కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు గౌరవం పొందుతారు. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. పెద్దల సలహాతో కొత్త పెట్టుబడులు పెడతారు. ఆరోగ్యంగా ఉండగలుగుతారు. విదేశాల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. విద్యార్థులు భవిష్యత్తుపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇంట్లో జరిగే శుభకార్యం గురించి చర్చిస్తారు.

    మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం కేటాయిస్తారు. దానధర్మాలు చేయడంలో ముందుకు వస్తారు. ఉన్నత విద్యా చదవాలనే వారికి అవకాశాలు వస్తాయి. సాయంత్రం పాత స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. విహారయాత్ర వెళ్ళడానికి ప్లాన్ చేస్తారు. జీవిత భాగస్వామి నుంచి పూర్తిగా మద్దతు ఉంటుంది. దీంతో వ్యాపారులు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. బంధువుల్లో ఒకరి నుంచి తల సహాయం అందుతుంది.

    కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : కర్కాటక రాశి వారికి హోలీ కలిసి రానుంది. ఈ రాశి ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారులు ప్రాజెక్టు కోసం పలువురుని సంప్రదిస్తారు. ఇవి ఓకే కావడానికి సంకేతాలు వినిపిస్తాయి. దీంతో ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇందుకోసం నాన్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. పిల్లల ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేస్తే తీవ్ర ప్రమాదం అవుతుంది. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.

    సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు నుంచి ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. కొన్ని ముఖ్యమైన పనులను వాయిదా వేస్తారు. కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో ప్రయాణాలు చేస్తారు. షాపింగ్ కోసం డబ్బు ఖర్చు అవుతుంది. ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చులు చేయాలి. లేకుంటే ఆర్థికంగా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటారు.

    కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఆదాయం పెంచుకొని ఎందుకు వివిధ మార్గాలను అన్వేషిస్తారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం అందుతుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరితో వాగ్వాదం ఉండే అవకాశం ఉంటుంది. అయితే మాటలను అదుపులో ఉంచుకోవాలి. జీవిత భాగస్వామితో గొడవలు ఉండే అవకాశం ఉంది. విద్యార్థులను ఉన్నత విద్య కోసం ప్లాన్ చేస్తారు. పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. సాయంత్రం ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు.

    తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇదే మంచి సమయం. అనారోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండదు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. డబ్బు విషయంలో ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు రావచ్చు. పాత సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి తల్లిదండ్రులు మద్దతు ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

    వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. ఆర్థిక లావాదేవులు చేసే ముందు ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. కుటుంబంలో సోదరుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. అయితే మాటల మాధుర్యంతో ఈ సమస్యను పరిష్కరించుకుంటారు. గతంలో అనుకున్న కొన్ని పనులను ఇప్పుడు పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి కోసం ఇష్టమైన వస్తువును కొనుగోలు చేస్తారు. స్నేహితులను కలవడంతో ఉల్లాసంగా ఉంటారు..

    ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : వ్యాపారాలు ఇప్పుడు తీసుకుని నిర్ణయాలు భవిష్యత్తులో లాభాలను తెస్తాయి. గతంలో కుటుంబ సభ్యులతో వివాదం ఉంటే నేటితో పరిష్కారం అవుతుంది. సాయంత్రం శుభవార్తలు వింటారు. విద్యార్థుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికి ఈరోజు నష్టాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలను చేసుకున్నట్లయితే పెద్దల సలహా తీసుకోవాలి.

    మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు నిరాశ వార్తలు వింటారు. వివాదాలు ఉన్నవారితో జాగ్రత్తగా మాట్లాడాలి. పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పూర్వీకుల ఆస్తి విషయంలో శుభవార్తలు అందేందుకు సమయం పడుతుంది. కుటుంబ సభ్యులతో వాగ్వాదం ఉంటుంది. అయితే మౌనంగా ఉండడంవల్ల సమస్య పెద్దదిగా కాకుండా ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు అయితే ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.

    కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : కుంభ రాశి వారికి గతంలో ఉన్న వివాదాలు నేటితో పరిష్కారం అవుతాయి. ఎదుటి వ్యక్తి మాతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారులకు కొత్త ప్రాజెక్టులు అందుతాయి. అయితే కొత్త వ్యక్తులతో ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

    మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఈ రాశి వారికి హోలీ పండుగ కలిసి రానుంది. గతంలో ఉన్న ఆదాయం కంటే రెట్టింపు అవుతుంది. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. అయితే కొందరు వీరి పనులను అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంటుంది. తెలివితేటలతో వాటిని పరిష్కరించేందుకు ఆలోచించాలి. ఖర్చులు పెరగడంతో కాస్త ఆందోళనగా ఉంటుంది. పిల్లల విషయంలో వస్తువుల కొనుగోలుకు ఖర్చులు చేస్తారు.