Today Horoscope In Telugu: జ్యోతిష శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశులపై మంగళవారం అశ్లేష నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో మాలవ్య రాజయోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి కెరీర్లో పురోగతి సాధిస్తారు. మరికొన్ని రాసిన వారు కుటుంబ సభ్యుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి ఉద్యోగులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కొందరికి పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల్లో ఒకరి ద్వారా భావోద్వేగానికి గురవుతారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. జీవిత భాగస్వామితో విభేదాలు ఉంటాయి. సాయంత్రం బంధువుల ఇంటికి వెళ్తారు. పాత స్నేహితులను కలిసి ఉల్లాసంగా ఉంటారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : సమాజంలో గౌరవం ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో సోదరుడి వివాహానికి సహకరిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త వారితో ఆర్థిక లావాదేవీలు జరపాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా అప్పు ఇవాల్సి వస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. బ్యాంకు నుంచి రుణాన్ని పొందుతారు. బంధువుల నుంచి ధన సహాయం పొందుతారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఆరోగ్యం పై ప్రత్యేకత వహించాలి. ఏ చిన్న నిర్లక్ష్యం వహించినా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో ఆశించిన లాభాలు రావు. దీంతో వ్యాపారస్తులు నిరాశతో ఉంటారు. ఉద్యోగులు ఓ ప్రవర్తన కారణంగా అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు. పిల్లల భవిష్యత్తు పై కీలక నిర్ణయం తీసుకుంటారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొత్తపెట్టబడలు పెడతారు. విద్యార్థులు పోటీ పరీక్షలు పాల్గొంటే విజయం సాధిస్తారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. కుటుంబంలో ఒకరితో వివాదం ఉంటుంది. అయితే తెలివితేటలతో సమస్యను పరిష్కరించుకుంటారు. డబ్బు కొరత ఏర్పడవచ్చు. ఇతరుల వద్ద అప్పు తీసుకుంటే తిరిగి చెల్లిస్తారు. బ్యాంకు నుంచి రుణం పొందుతారు. కొత్త వాహనాల కొనుగోలు కోసం ప్రణాళికలు వేస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పిల్లల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు అనేక సవాళ్లు ఎదురవుతాయి. ఓ సమస్య పరిష్కారం కోసం తీవ్రంగా కష్టపడతారు. కొందరు సలహాలు ఇచ్చినట్లు ఇచ్చి అడ్డుకట్ట వేస్తారు. రాజకీయాల్లో ఉండే వారికి అనుకూలమైన రోజు. వీరు చాలా సంతోషంగా ఉంటారు. వ్యాపారులకు అనుకున్న లాభాలు వస్తాయి. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. అయితే లక్ష్యాలను పూర్తి చేసే క్రమంలో సీనియర్లతో సంయమను పాటించాలి. లేకుంటే వాగ్వాదానికి దిగాల్సి వస్తుంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారు ఈరోజు ఏదైనా పనిని ప్రారంభిస్తే అందులో విజయం సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే సక్సెస్ అవుతారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. కొన్ని పనులు పూర్తి చేయలేక పోతే వాటిని వాయిదా వేస్తారు. వ్యాపారులు ఊహించని లాభాలు పొందుతారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. కొత్తగా ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . తులారాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. ఏ చిన్న ఇబ్బంది కలిగినా వైద్యుడిని సంప్రదించాలి. ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలి. పిల్లల భవిష్యత్తుపై కీలకని నిర్ణయం తీసుకుంటారు. కొత్తగా పెట్టుబడులను పెడతారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చేసిన పెట్టుబడులు అధిక లాభాలు ఇస్తాయి. తల్లిదండ్రులు ఆశీర్వాదంతో వ్యాపారులు లాభాలు పొందుతారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే కష్టపడాల్సి వస్తుంది. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. కొత్త వారితో అప్పుడే ఆర్థిక వ్యవహారాలు జరపొద్దు. బంధువుల్లో ఒకరి నుంచి ధన సహాయం పొందుతారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంటుంది. ఇందుకోసం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకున్నట్లయితే ఇవి భవిష్యత్తులో లాభాలు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. సాయంత్రం పిల్లలతో ఉల్లాసంగా ఉంటారు. పాత స్నేహితులను కలవడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఇంటికి సంబంధించిన పనులన్నీ పూర్తి చేస్తారు. దీంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. వివాహం చేసుకోవాలని అనుకునే వారికి ప్రతిపాదనలు వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తే ఇదే అనుకూలమైన సమయం. వ్యాపారులు కొత్తగా లాభాలు పొందుతారు. భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : కుంభ రాశి వారికి తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంటుంది. దీంతో వ్యాపారులకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. సాయంత్రం బంధువుల ఇంటికి వెళ్తారు. అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. పిల్లల భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకుంటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకోవాలి. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఈ పరిస్థితిని చూసి కొందరు ఓర్వలేక పోతారు. అందువల్ల కొత్త వ్యక్తులతో ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు.