https://oktelugu.com/

Today Horoscope In Telugu: ఈ రాశుల వారికి ఖర్చులు అధికం.. జాగ్రత్తగా ఉండకపోతే తీవ్ర నష్టం..

Today Horoscope In Telugu చాలాకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తుతాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : March 1, 2025 / 08:05 AM IST
    Horoscope Today(14)

    Horoscope Today(14)

    Follow us on

    Today Horoscope In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశులపై శనివారం పూర్వాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి శని దేవుడి అనుగ్రహం ఉంటుంది. మరికొన్ని రాసిన వారికి ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలు పాల్గొంటే విజయం సాధిస్తారు. వేషంతో సహా మీనం వరకు మొత్తం రాసిన ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వారు ఏ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీంతో కొన్ని ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారులు లాభాలు పొందుతారు. అయితే కొత్తవారితో ఆర్థిక వ్యవహారాలు జరిపే ముందు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల సహకారంతో కొత్త పెట్టుబడిన పెడతారు. ఉద్యోగులు సీనియర్ల మద్దతుతో లక్ష్యాలను పూర్తి చేసి సంతోషంగా ఉంటారు. కొందరు పదోన్నతి పొందే అవకాశం.

    వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దీంతో 50 నుంచి పూర్తి మద్దతు పొందుతారు. బంధువుల నుంచి దన సహాయం అందుతుంది. తల్లిదండ్రుల సహకారంతో వ్యాపారులు లాభాలు పొందుతారు. నిరుద్యోగులు ఉద్యోగాలు వెతుక్కునే ప్రయత్నంలో కాస్త కష్టపడాల్సి వస్తుంది. అయినా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్తే ఫలితాలు సాధిస్తారు.

    మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): చాలాకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండటమే మంచిది. సోదరుడు వివాహం కోసం చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. నిర్ణయాలు తీసుకునే సమయంలో తొందర పడొద్దు. పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించుకుంటారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

    కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారులకు ధర్నాపం ఎక్కువగా ఉంటుంది. కొత్తగా పెట్టుకోవాలి పెట్టేందుకు ముందుకు వస్తారు. పూర్వీకుల ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు. భవిష్యత్తు కోసం తీసుకుని నిర్ణయాలు కీలకంగా ఉంటాయి. సాయంత్రం కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

    సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. కొందరి ప్రవర్తన కారణంగా విలువైన ఆస్తులు కోల్పోవాల్సి వస్తుంది. కొత్త వారితో ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మద్దతుతో కొత్త ప్రాజెక్టులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

    కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు కొన్ని విషయాల్లో కీలక నిర్ణయం తీసుకుంటారు. సాయంత్రం వరకు చేసే కొన్ని పనులు ఇబ్బందిగా మారుతాయి. దుబారా ఖర్చులు పెరుగుతాయి. ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. పిల్లలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మనసులో ప్రతికూల వాతావరణ ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సివస్తే పెద్దల సలహా తీసుకోవాలి.

    తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అదరపు బాధ్యతలు పెరిగే అవకాశం. పిల్లల కెరీర్ విషయంలో శుభవార్తను వింటారు. ఉద్యోగాలు మారే విషయంలో కాస్త ఆలోచించాలి. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు.

    వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : సోదరుల వివాహం కోసం కీలక నిర్ణయం తీసుకుంటారు. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. దీంతో మనసు ఆందోళనగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. విదేశాల్లో ఉండే వారి నుంచి శుభవార్తను వింటారు. ఖర్చులను నియంత్రించుకోవాలి. పిల్లల కెరీర్ విషయంలో శుభవార్తలు వింటారు. వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది.

    ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మానసికంగా ప్రశాంతతతో ఉంటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు పెద్దల సలహా తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రాజకీయ నాయకులకు అనుకూల వాతావరణం.

    మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఎవరితో అయినా విభేదాలు ఉంటే ఈరోజుతో పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యులు స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సాయంత్రం పాత స్నేహితులను కలుస్తారు. ఇంట్లో ఉల్లాసంగా ఉంటారు.

    కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులు కొత్త ప్రణాళికలు చేపడుతారు.

    మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : మాటతీరుతో అందరిని ఆకట్టుకుంటారు. కుటుంబ సభ్యులతో ప్రయాణం చేస్తారు. వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాలు కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. కొత్తగా పనులు ప్రారంభించే వారు పెద్దల సలహా తీసుకోవాలి.