Mahesh Babu
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో శరవేగంగా జరుగుతుంది. అదేంటి.. మహేష్ బాబుకు కరోనా సోకింది కదా.. మరి షూటింగ్ ఎలా చేస్తున్నారు ? అంటూ నెటిజన్లు షాక్ అవుతున్నారు. అసలు విషయం ఏమిటంటే.. ‘సర్కారు వారి పాట’లో మహేష్ లేని సన్నివేశాలను ఇప్పుడు తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఈ రోజు షూటింగ్ వచ్చేసి వైజాగ్ బీచ్ రోడ్, జగదాంబ సెంటర్ పరిసర ప్రాంతాలలో షూట్ చేస్తున్నారు.
ఇప్పటికే మేకర్స్ ఈ ఏడాది ఏప్రిల్ 1న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు, అందుకే శరవేగంగా ఈ షెడ్యూల్ స్టార్ట్ చేశారు. ఇక ఈ సినిమా హీరోయిన్ కీర్తి సురేశ్ కి కూడా కరోనా సోకింది. ఆమెకు కరోనా రాకపోయి ఉండి ఉంటే.. ఆమె కూడా ఈ షెడ్యూల్ లో జాయిన్ అయ్యేది. ఈ షెడ్యూల్ తర్వాత.. అలాగే మహేష్ – కీర్తి లకు కరోనా తగ్గినా తర్వాత.. కీర్తి సురేష్ – మహేష్ లతో పాటు మిగిలిన ప్రధాన పాత్రల కాంబినేషన్ లో కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తారట.
Also Read: ‘ఆర్ఆర్ఆర్’ సెన్సార్ రివ్యూ.. – సినిమా ఎలా ఉందంటే.. ?
ఆ సీన్స్ లోనే మహేష్ – కీర్తి సురేష్ ల పెళ్లి చూపులు సీన్ కూడా ఉందట. పెళ్లి చూపులు సీన్ సినిమాలో బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోందట. కాగా సెన్స్ బుల్ సినిమాల దర్శకుడు పరశురామ్ డైరెక్షన్ లో రాబోతున్న ఈ క్రేజీ సినిమాలో మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల ప్రస్తావన ప్రధానంగా ఉండబోతుంది.
Mahesh Babu: తమిళంలోకి ‘ఆహా’.. ఇక్కడ బాలయ్య – బన్నీ.. అక్కడ విజయ్ కాంత్ – సూర్య !
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Sarkaru vari pata movie shooting in vizag without mahesh
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com