https://oktelugu.com/

సడలింపుపై కేసీఆర్ వైఖరి!

మే 3తో రెండవ దశ లాక్ డౌన్ ముగుస్తుండటంతో.. దేశంలో అనేక ఆర్థిక కార్యకలాపాలకు సడలింపులిస్తూ.. మూడవ దశ లాక్ డౌన్ ని మే 17 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే తెలంగాణలో ఎక్కడా సడలింపులు ఇవ్వొద్దని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలిసింది. కేంద్రం విడుదల చేసిన లాక్‌బ డౌన్​ గైడ్‌ లైన్స్, సడలింపులపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్​ ఫోన్‌ లో మాట్లాడినట్టు తెలిసింది. లాక్‌ డౌన్‌ ను పకడ్బందీగా అమలు చెయ్యాలని వారికి […]

Written By: , Updated On : May 2, 2020 / 11:51 AM IST
Follow us on

మే 3తో రెండవ దశ లాక్ డౌన్ ముగుస్తుండటంతో.. దేశంలో అనేక ఆర్థిక కార్యకలాపాలకు సడలింపులిస్తూ.. మూడవ దశ లాక్ డౌన్ ని మే 17 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే తెలంగాణలో ఎక్కడా సడలింపులు ఇవ్వొద్దని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలిసింది. కేంద్రం విడుదల చేసిన లాక్‌బ డౌన్​ గైడ్‌ లైన్స్, సడలింపులపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్​ ఫోన్‌ లో మాట్లాడినట్టు తెలిసింది. లాక్‌ డౌన్‌ ను పకడ్బందీగా అమలు చెయ్యాలని వారికి సూచించినట్లు సమాచారం. ఈ నెల 7 తర్వాత ఏం చేయాలన్న దానిపై ఈ నెల 5న రాష్ట్ర కేబినెట్​భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు కేసీఆర్.

కేంద్రం జారీ చేసిన రూల్స్​ ప్రకారం తెలంగాణలో చాలా జిల్లాల్లో లాక్‌ డౌన్  సడలింపులను ఈ నెల 7 తర్వాత అమలు చేసే ఛాన్స్​ ఉందని ఉన్నతాధికారులు అన్నారు. లాక్‌ డౌన్‌ పై కేంద్రం ఇచ్చిన కొత్త గైడ్ లైన్స్‌ ను పరిశీలిస్తున్నామని సీఎస్ సోమేశ్​కుమార్​చెప్పారు. వీటిపై ఈ నెల 5న రాష్ట్ర కేబినెట్ మీటింగ్‌ లో ఫైనల్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.