Homeఎంటర్టైన్మెంట్వెబ్ సిరీస్ వైపు చూస్తున్న సుకుమార్

వెబ్ సిరీస్ వైపు చూస్తున్న సుకుమార్


హాలీవుడ్ లో గాని , హిందీలో గానీ పేరున్న నటీనటులు, దర్శకులు వెబ్ సిరీస్‌లు చేస్తున్నారు. కానీ తెలుగులో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా వుంది. క్రిష్ జాగర్లమూడి, నందినీ రెడ్డి , సత్యదేవ్ లాంటి వాళ్లు తప్పితే పేరున్న దర్శకులు అటు వైపు చూడట్లేదు. అలాంటి సమయం లో టాప్ డైరెక్టర్ సుకుమార్ వెబ్ సిరీస్ వైపు చూస్తున్నట్లు వార్త లొస్తున్నాయి.

లాక్‌ డౌన్‌3.0 లో నిబంధనలు ఇవే!

త్వరలో దర్శకుడు సుకుమార్ ఓ వెబ్ సిరీస్‌ను నిర్మించవచ్చని తెలుస్తోంది. అది ఆయన కొత్త సినిమా ‘పుష్ప’కు అనుబంధంగా ఉంటుందని తెలుస్తోంది. నిజానికి ” పుష్ప “. సినిమా కథ తయారు చేసుకొనే క్రమంలో సుకుమార్ ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి ఎంతగానో పరిశోధన చేయడం జరిగింది. దాంతో సుకుమార్ వద్ద ఎర్ర చందనం అక్రమ రవాణా గురించిన అనేక రహస్యాలు , వాటికి సంబందించిన సమాచారం ఉంది. కానీ సినిమాకి ఉన్న పరిమితులు దృష్ట్యా ఆ సమాచారం లో కొంత మాత్రమే ఉపయోగించుకోవడం జరుగుతోంది. అలా మిగిలి ఉన్న ఎర్ర చందన స్మగ్లింగ్ సమామాచారం తో వెబ్ సిరీస్ చేద్దామన్న ఆలోచన సుకుమార్ కి వచ్చిందట… ఒక దశలో ‘పుష్ప’కు సీక్వెల్ తీస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా నడిచిందట …. దీనిపై సుకుమార్ రకరకాలుగా ఆలోచించాడని .. చివరికి వెబ్ సిరీస్‌కే మొగ్గు చూపాడని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది .

పత్రికలను ప్రభుత్వం ఆదుకోవాలా?

ఆ క్రమం లో ` అమేజాన్ ప్రైం ‘ సంస్థ తో ఈ విషయం ఫై డిస్కషన్లు నడుస్తున్నాయట. కాగా రామ్ చరణ్ బందువొకరు అమేజాన్ సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారని, ఆయన వాళ్లతో మాట్లాడి బడ్జెట్, ఇతర వ్యవహారాల్ని ఫైనలైజ్ చేస్తున్నారని.తెలుస్తోంది . ఈ ప్రాజెక్ట్ కనుక సెట్ అయితే రామ్ చరణ్ అందులో భాగస్వామి అయ్యే అవకాశం ఉంది. ఇంతకీ ఈ ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేసేది ఎవరన్నది మాత్రం సస్పెన్సు గానే ఉంది .

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version