https://oktelugu.com/

లాక్‌డౌన్ తో కుప్పకూలుతున్న ప్రింట్ మీడియా

లాక్‌డౌన్ కారణంగా పత్రికా రంగం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంక్షోభకర పరిష్టితులలో చిక్కుకొంటున్నది. పత్రికలకు జీవమైన ప్రకటనలు లేకుండా గత నెలన్నర రోజులుగా ప్రచురింపవలసి రావడంతో తీవ్ర నష్టాలకు గురవుతున్నాయి. పైగా, రవాణా ఇబ్బందుల కారణంగా నామమాత్రపు ప్రతులను మాత్రమే ప్రచురిస్తున్నాయి. దానితో ఇప్పటిలో అవి కోలుకొనే కారణం కనిపించడం లేదు. పత్రికలను ప్రభుత్వం ఆదుకోవాలా? ఈ సంక్షోభం నుండి బైట పడడానికి సిబ్బంది జీతాలకు కొందరు కొత్త విధిస్తుంటే, మరికొందరు సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవడం ప్రారంభించారు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 2, 2020 / 11:54 AM IST
    Follow us on


    లాక్‌డౌన్ కారణంగా పత్రికా రంగం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంక్షోభకర పరిష్టితులలో చిక్కుకొంటున్నది. పత్రికలకు జీవమైన ప్రకటనలు లేకుండా గత నెలన్నర రోజులుగా ప్రచురింపవలసి రావడంతో తీవ్ర నష్టాలకు గురవుతున్నాయి. పైగా, రవాణా ఇబ్బందుల కారణంగా నామమాత్రపు ప్రతులను మాత్రమే ప్రచురిస్తున్నాయి. దానితో ఇప్పటిలో అవి కోలుకొనే కారణం కనిపించడం లేదు.

    పత్రికలను ప్రభుత్వం ఆదుకోవాలా?

    ఈ సంక్షోభం నుండి బైట పడడానికి సిబ్బంది జీతాలకు కొందరు కొత్త విధిస్తుంటే, మరికొందరు సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవడం ప్రారంభించారు. పత్రికారంగం తీవ్ర నష్టాలతో కూరుకు పోవడంతో ఆదుకునేందుకు బలమైన ఉద్దీపన ప్యాకేజీని అందించాలని ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) ప్రభుత్వాన్ని కోరింది.

    ఇప్పటికే రూ.4,000 కోట్లకు పైగా నష్టపోయిందని, ఉపశమనం కలిగించకపోతే వచ్చే ఆరేడు నెలల్లో రూ.15,000 కోట్ల వరకు నష్టపోయే అవకాశం ఉందని పేర్కొంది. లాక్‌డౌన్ నేపథ్యంలో అటు ప్రకటనల నుంచి కానీ, ఇటు సర్క్యులేషన్ వల్ల కానీ ఆదాయం లేనందున వార్తా పత్రికా రంగం దేశంలో బాగా నష్టపోయినట్టు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శికి రాసిన లేఖలో ఐఎన్ఎస్ అధ్యక్షుడు శైలేష్ గుప్తా తెలిపారు.

    లాక్ డౌన్ పొడిగింపు: లాభమా? నష్టమా?

    న్యూస్‌ప్రింట్‌పై ఐదు శాతం దిగుమతి సుంకాన్ని ప్రభుత్వాన్ని ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా ఐఎన్ఎస్ కోరింది. లాక్‌డౌన్ కారణంగా విధులకు హాజరు కాలేని వారిని సెలవు దినాలుగా పరిగణిస్తున్నట్లు ఇప్పటికే ప్రముఖ పత్రికా సంస్థలు స్పష్టం చేశాయి. ఈ సందర్భంగా తమ ఉద్యోగ భద్రతకు ఏర్పాటైన ప్రమాదం నుండి రక్షణ కల్పించాలని కోరుతూ పలు జర్నలిస్ట్ సంఘాలు ఇప్పటికే సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించాయి.