గ్రామ వాలంటీర్ల సేవలో నిజమెంత?

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ కార్యదర్శుల వ్యవస్థ దేశంలోనే అతిపెద్ద ఉద్యోగ కల్పనగా పేరుగడించింది. అధికారంలోకి రాగానే సుమారు 4 లక్షల మంది గ్రామ కార్యదర్శులను సీఎం జగన్ నియమించారు. వారి నియామకం, పనితీరు పట్ల మొదట్లో చాలా వ్యతిరేకత వచ్చింది. వాలంటీర్ల వ్యవస్థే లోపభూయిష్టమని, వారికి సరైన శిక్షణ, వివిధ అంశాలపై సరైన అవగాహన లేదని, వారు సేకరించి పంపే సమాచారం విశ్వసనీయత లేదనే అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు.అయితే కాల క్రమేణా ఆ వ్యవస్థ పని తీరు […]

Written By: Neelambaram, Updated On : April 10, 2020 11:50 am
Follow us on

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ కార్యదర్శుల వ్యవస్థ దేశంలోనే అతిపెద్ద ఉద్యోగ కల్పనగా పేరుగడించింది. అధికారంలోకి రాగానే సుమారు 4 లక్షల మంది గ్రామ కార్యదర్శులను సీఎం జగన్ నియమించారు. వారి నియామకం, పనితీరు పట్ల మొదట్లో చాలా వ్యతిరేకత వచ్చింది. వాలంటీర్ల వ్యవస్థే లోపభూయిష్టమని, వారికి సరైన శిక్షణ, వివిధ అంశాలపై సరైన అవగాహన లేదని, వారు సేకరించి పంపే సమాచారం విశ్వసనీయత లేదనే అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు.అయితే కాల క్రమేణా ఆ వ్యవస్థ పని తీరు పై సానుకూల పవానాలు వీచాయి. రేషన్ పంపిణి, పెన్షన్ లు ఇవ్వడం, ఆధార్ కార్డ్, రేషన్ కార్డు విషయాలలో సమస్యల పరిస్కారం ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో గ్రామ వాలంటీర్ల సేవలు అమోఘం.

ప్రస్తుతం యావత్ భారతావని కరోనా భయంతో అల్లాడిపోతుంది. దింతో ఈ కాలాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించారు. అంతేకాకుండా 21రోజుల సంపూర్ణ లాక్ డౌన్ విధించారు. ప్రజలు ఎవరు ఇంట్లో నుంచి బయటకు రాకుండా కఠిన చర్యలు అమలుపరుస్తున్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా గ్రామ వాలంటీర్ల వ్యవస్థ పనిచేస్తుంది.

ప్రభుత్వం ప్రకటించిన ఉచిత రేషన్, ప్రతి కుటుంబానికి రూ.1000 ల పంపిణి, మరియు పెన్షన్ వంటివి ప్రజలకు అందజేయడంలో గ్రామ వాలంటీర్లు చురుకుగా పనిచేస్తున్నారు. ప్రతి ఇంటికీ వెళ్ళి గ్రామ వాలంటీరే తన వేలి ముద్ర వేసి వారికి రావాల్సిన రూ.1000 గ్రాంట్ లేదా పెన్షన్ ఇవ్వడం గమనార్హం మరి ముఖ్యంగా కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇతర జిల్లాలు, రాష్టాలు లేదా దేశాల నుండి గ్రామానికి ఎవరైనా వచ్చినట్లైంతే.. వారిని గుర్తించి, వెంటనే “గ్రామ వాలంటీర్ యాప్” ద్వారా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడం మరియు ఆ గ్రామంలో ఉన్న ఏఎన్ఎం, ఆశా వర్కర్ల ద్వారా టెస్టులు చేయించడం, కరోనా లక్షణాలు ఏమైనా ఉంటె వెంటనే జిల్లా ఆసుపత్రులకు తరలించడం వంటి ముఖ్యమైన పనులు చక చక జరుగుతున్నాయి. చెక్ పోస్టు ఉన్న సరిహద్దు గ్రామాలలో గ్రామ వాలంటీర్లు సెక్యూరిటీ గార్డ్ ల వలే డ్యూటీలు చేయడం అమోఘం. ఈ విధంగా కరోనా వ్యాప్తిని అరికట్టడంలో గ్రామ వాలంటీర్ల పని తీరు ప్రశంసనీయం. దీంతో ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వాలంటీర్ల పనితీరును మెచ్చుకుంటూ.. జాతీయ మీడియా, జగన్ సర్కార్ పై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించడం ఆంధ్రాకి మరింత గర్వకారణం.