ఒక్క రోగానికి మందేస్తే ఉన్న రోగాలన్నీ పోయాయి

కరోనా వచ్చాక ఆసుపత్రికి వెళ్లే రోగుల్లో మార్పు వచ్చింది. మొన్నటి వరకు ఇసుకేస్తేరాలని ఆసుపత్రులు కరోనా దెబ్బకు వెలవెల పోతున్నయి..ఇంతకు ముందు ఆసుపత్రులు ,రక్త పరిక్ష కేంద్రాలకు ప్రజలు అనవసరంగా , అనుమానంతో డబ్బులు ఖర్చు చేసారా..అన్న అనుమానం ఎవరికైనా రాక మానదు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే .. షుగర్ , బిపి ,కంటి జబ్బులు , కీళ్ల నొప్పులు , గుండె జబ్బులు , నరాల వ్యాధులు ఇలా రకరకాల జబ్బులకు చీటికీ మాటికీ చికిత్స […]

Written By: Neelambaram, Updated On : April 9, 2020 2:49 pm
Follow us on


కరోనా వచ్చాక ఆసుపత్రికి వెళ్లే రోగుల్లో మార్పు వచ్చింది. మొన్నటి వరకు ఇసుకేస్తేరాలని ఆసుపత్రులు కరోనా దెబ్బకు వెలవెల పోతున్నయి..ఇంతకు ముందు ఆసుపత్రులు ,రక్త పరిక్ష కేంద్రాలకు ప్రజలు అనవసరంగా , అనుమానంతో డబ్బులు ఖర్చు చేసారా..అన్న అనుమానం ఎవరికైనా రాక మానదు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ..

షుగర్ , బిపి ,కంటి జబ్బులు , కీళ్ల నొప్పులు , గుండె జబ్బులు , నరాల వ్యాధులు ఇలా రకరకాల జబ్బులకు చీటికీ మాటికీ చికిత్స చేసే ప్రత్యేక ఆసుపత్రులు ఇప్పుడు ఎందుకు నిర్మానుష్యంగా మారాయి ఆసుపత్రులలో OP మూసి వేసినప్పటికీ ప్రజలు ఏమీ ఇబ్బంది పడటం లేదు. వ్యాధులు అంతగా ఎలా తగ్గాయి? వీధుల్లో వాహనాలు లేవు కాబట్టి రోడ్డు ప్రమాదం అన్న ఊసే లేదు. కానీ గుండెపోటు, మెదడు రక్తస్రావం లేదా రక్తపోటు వంటి సమస్యలు ఏమయ్యాయి ?.

దేశం మొత్తం మీద స్మశాన ఘాట్ కు రోజూ వచ్చే మృతదేహాల సంఖ్య 25-30 శాతం తగ్గిందట. ఢిల్లీ లోని హరిశ్చంద్ర ఘాట్ కి సగటున 80 నుండి 100 మృతదేహాలు వచ్చేవట కానీ కరోనా వాతావరణంలో 20 లేదా 25 మృతదేహాలు వస్తున్నాయి..అంటున్నారు .అంతెందుకు ఇది వేసవి కాలం. ఈ సమయంలో ప్రతి సంవత్సరం మృతుల సంఖ్య బాగా ఉండేదట. కానీ ప్రస్తుత కరోనా పరిస్థితి లో మృతుల సంఖ్య బాగా తగ్గిందంటున్నారు .కొత్త రోగుల సంఖ్య పెరగలేదు, కొత్తగా ఎవరికీ రోగాలు రావట్లేదు.

ఇప్పుడు మనకు అర్థం కాని విషయం ఏమిటంటే నిజంగానే కరోనా వైరస్ మిగతా అన్ని వ్యాధులను ప్రభావితం చేసిందా..? లేదా ఆ వ్యాధులన్నీ కరోనా వైరస్ ముందు చిన్నవిగా కనిపిస్తునాయా? ఇది వైద్య వృత్తి యొక్క ఉనికికే పెద్ద సవాలుగా మారింది. కార్పొరేట్ ఆసుపత్రుల ఆవిర్భావం తరువాత, స్వల్పంగా జలుబు చేసినా, మరియు దగ్గు వచ్చినా బిల్లులు తడిసి మోపెడయ్యేవి. ఇప్పుడు చాలా ప్రైవేట్ ఆసుపత్రులలో పడకలు ఖాళీగా ఉంటున్నాయట … అంటే ఇక్కడ వైద్యుల యొక్క ప్రాముఖ్యతను తగ్గించడానికి మనం ప్రయత్నించడం లేదు. కోవిడ్19 వచ్చిన రోగులకు వారు చేస్తున్న సేవలకు శిరస్సు వంచి పాదాభివందనం చేద్దాం.

ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే మనలోని భయమే మనకున్న చాలా పెద్దరోగం. దాని వల్లె ఇన్ని సమస్యలు వస్తున్నాయి అనుకోవాలి. అవన్నీ ఒకెత్తు అయితే గత కొన్ని రోజులుగా ప్రజలు ఇంటి పట్టునే ఉండి మంచి ఆహారం తింటున్నారు. రెస్టారెంట్లు లేకపోవడం కూడా ఒకందుకు మంచిదే ..అయింది. ఇంతకి తేలేదేమంటే ప్రజలకు స్వచ్ఛమైన నీరు మరియు స్వచ్ఛమైన ఆహారం లభిస్తే, సగం వ్యాధులు అలా వచ్చి ,ఇలా తొలగిపోతాయి.

చాలాకాలం క్రిందట ఒక దేశంలో వైద్యుల సమ్మె జరిగిందట, సరిగ్గా ఆ కాలంలో మరణాల సంఖ్య బాగా తగ్గినట్లు సర్వేలో తేలింది. ఆరోగ్యం మన జీవనశైలిలో ఒక భాగం, ఇది వైద్యులపై మాత్రమే ఆధారపడి ఉండదు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని వైద్యులు ఎప్పటికీ కోరుకోరని మహాత్మా గాంధీ హింద్ స్వరాజ్ లో రాసింది నూటికి నూరు పాళ్ళు నిజమని తేలుతోంది .