మోడీ నిర్ణయాలకు కేసీఆర్ గుడ్ బై?

తెలంగాణలో ఈనెల మొదటిలోనే కోవిద్19 కేసుల సంఖ్య తగ్గిపోతుందని సీఎం కేసీఆర్ అంచనా వేశారు. అయితే ఢిల్లీ జమాత్ సంఘటన తర్వాత అంచనాలకు భిన్నంగా హైదరాబాద్ తో పాటు మరిన్ని జిల్లాల్లో ఎక్కువ మొత్తంలో పాజిటివ్ కేసులు తెర పైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు మరియు లాక్ డౌన్ మినహాయింపులను తెలంగాణలో అమలు చేయకూడదని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా కట్టడి విషయంలో ప్రధాని మోడీ నిర్ణయాలకు కాస్త భిన్నంగా సీఎం […]

Written By: Neelambaram, Updated On : April 17, 2020 8:37 pm
Follow us on

తెలంగాణలో ఈనెల మొదటిలోనే కోవిద్19 కేసుల సంఖ్య తగ్గిపోతుందని సీఎం కేసీఆర్ అంచనా వేశారు. అయితే ఢిల్లీ జమాత్ సంఘటన తర్వాత అంచనాలకు భిన్నంగా హైదరాబాద్ తో పాటు మరిన్ని జిల్లాల్లో ఎక్కువ మొత్తంలో పాజిటివ్ కేసులు తెర పైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు మరియు లాక్ డౌన్ మినహాయింపులను తెలంగాణలో అమలు చేయకూడదని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కరోనా కట్టడి విషయంలో ప్రధాని మోడీ నిర్ణయాలకు కాస్త భిన్నంగా సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రెండోవ దశ లాక్ డౌన్ పొడిగింపు విషయంలో కేసీఆర్ వైఖరి స్పష్టమైంది. మోడీ నిర్ణయానికి ముందే కేసీఆర్ లాక్ డౌన్ పొడిగించారు. అదే విధంగా వైరస్ ప్రభావం లేని ప్రాంతాల్లో ఏప్రిల్ 20 వ తేదీన లాక్ డౌన్ నిబంధనలను పాక్షికంగా సడలిస్తున్నామంటూ కేంద్రం మార్గదర్శకాల‌ను జారీచేసింది.ఈ నిర్ణయం పై కూడా సీఎం కేసీఆర్ అంగీకరించడంలేదు. ప్రగతిభావన్ లో సమీక్ష నిర్వహించి ఏప్రిల్ 20 తర్వాత సడలింపు విషయంలో తమ నిర్ణయం చెబుతాని కేసీఆర్ స్పష్టం చేశారు.

అంతేకాకుండా అత్యవసర సేవలకు మొదటి నుండి లాక్ డౌన్ కు మినహాయింపులు ఇవ్వగా ఇప్పుడు దీనికి తోడుగా మరిన్ని సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలు కొందరిలో హర్షం వ్యక్తం చేశాయి . అయితే ఈ మార్గదర్శకాలు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కు పెద్దగా రుచించలేదు.

ఇక నుంచి రాష్ట్రంలో ఏటువంటి నిర్ణయమైనా కేంద్రంతో సంభంధం లేకుండా అమలుపరచాలని ఆ విధంగా కరోనాని కట్టడి చేయాలని కేసీఆర్ కంకణం కట్టుకొని కూర్చున్నట్లు తెలుస్తోంది.