జగన్ కు కరోనా టెస్ట్ రిపోర్ట్.. ఏమొచ్చిందంటే?

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం కరోనా టెస్ట్ చేయించుకున్నారు. దక్షిణ కొరియా నుండి కరోనా ర్యాపిడ్ టెస్ట్ కు సంభందించిన లక్ష కిట్లు రాష్టానికి వచ్చాయి. తాడేపల్లిలోని తన నివాసంలో ఆ కిట్ లను పరిశీలించి ప్రారంభించిన సీఎం స్వయంగా తనే ముందుకు వచ్చి టెస్ట్ చేయించుకున్నారు. ఈ టెస్ట్ ఆయనకు కరోనా నెగెటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ టెస్ట్ కు సమయం 10 నిముషాలు పడుతుందని […]

Written By: Neelambaram, Updated On : April 17, 2020 8:36 pm
Follow us on


రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం కరోనా టెస్ట్ చేయించుకున్నారు. దక్షిణ కొరియా నుండి కరోనా ర్యాపిడ్ టెస్ట్ కు సంభందించిన లక్ష కిట్లు రాష్టానికి వచ్చాయి. తాడేపల్లిలోని తన నివాసంలో ఆ కిట్ లను పరిశీలించి ప్రారంభించిన సీఎం స్వయంగా తనే ముందుకు వచ్చి టెస్ట్ చేయించుకున్నారు.

ఈ టెస్ట్ ఆయనకు కరోనా నెగెటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ టెస్ట్ కు సమయం 10 నిముషాలు పడుతుందని తెలిపారు. సీఎం నివశిస్తున్న తాడేపల్లి పట్టణంలో ఒకరికి కరోనా సోకింది. బఫర్ జోన్ లో ఆయన నివాసం ఉండటంతో అధికారులు, ఆ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.