‘మే 3’ వెనుక మోడీ మార్క్..!?

ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రులందరితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చాలా రాష్ట్రాల సీఎం లు లాక్ డౌన్ ను ఏప్రిల్ 30 వరకు పొడిగించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడికి మే 3వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. అంతకంటే ముందే కేంద్రం నిర్ణయంతో సంబంధం లేకుండానే ఏప్రిల్ 30వ తేదీ వరకు లాక్‌ డౌన్ ‌ను పొడిగిస్తున్నట్లు ఒడిశా, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు […]

Written By: Neelambaram, Updated On : April 14, 2020 3:13 pm
Follow us on

ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రులందరితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చాలా రాష్ట్రాల సీఎం లు లాక్ డౌన్ ను ఏప్రిల్ 30 వరకు పొడిగించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడికి మే 3వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.

అంతకంటే ముందే కేంద్రం నిర్ణయంతో సంబంధం లేకుండానే ఏప్రిల్ 30వ తేదీ వరకు లాక్‌ డౌన్ ‌ను పొడిగిస్తున్నట్లు ఒడిశా, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు అరుణాచల్‌ ప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాల సీఎం లు ప్రకటించుకున్నారు. దీంతో ప్రధాని మోడీ కూడా ఏప్రిల్ 30వ తేదీ వరకే లాక్‌ డౌన్ ‌ను పొడిగిస్తారని అందరూ భావించారు. కానీ.. అనూహ్యంగా మే 3వ తేదీ వరకు లాక్‌ డౌన్ ‌ను పొడిగించారు. లెక్క‌లో ఏదో తేడా కొట్టింది.దింతో ఆయా రాష్ట్రాలు పొడిగించిన లాక్ డౌన్ తేదీల నిర్ణయాలకు కేంద్రం చెక్ పెట్టినట్లయింది.

రాష్ట్రాలు, కేంద్రం ప్రకటించిన లాక్ ‌డౌన్ పొడిగింపు తేదీల్లో ఎందుకీ తేడా అన్నదానిపై దేశవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఏప్రిల్ 30 కాకుండా మే 3వ తేదీ వరకు మోడీ ఎందుకు పొడిగించారు..? ఇందులో ఏమైనా ప్రత్యేకత ఉందా..? అన్న ప్రశ్నలు అందరి మెదళ్లను తొలుస్తున్నాయి. ఇందులో ఏదో మోడీ మార్క్ తప్పకుండా ఉండి ఉంటుందని పలువురు విశ్లేషకులు అంటున్నారు.

ఇక్కడే ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 24 నుంచి రంజాన్ నెల ప్రారంభం అవుతోంది. అక్కడనుండి 40 రోజులు పాటు రంజాన్ పండుగ కొనసాగనుంది. అంటే మే 25 నుండి జూన్ 3 వరకు 40 రోజులు కాబ‌ట్టి లాక్ డౌన్ ని ఏప్రిల్ 30కి కాకుండా మే 3 వరకు పొగిడించినట్లైయితే.. త‌రువాత మే 31 వ‌ర‌కు లాక్ ‌డౌన్ ను రాష్ట్రాలు ఖ‌చ్చితంగా పెంచుకుంటాయి. అలా అలా జూన్ 3వ తేదీ వ‌ర‌కు దేశంలో ఖ‌చ్చితంగా లాక్‌ డౌన్ అమలలో ఉంటుంది. దింతో ముస్లింలు ఇళ్లలోనే రంజాన్ జరుపుకొని, కరోనా వ్యాప్తికి చెక్ పెట్టొచ్చుని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.