https://oktelugu.com/

RRR Postponement: ఆర్ ఆర్ ఆర్ వెనక్కి వెళ్లినా.. భీమ్లా నాయక్ ముందుకు రాలేదు ఎందుకు?

RRR Postponement: తమిళనాడు, మహారాష్ట్రలో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ నడిపేలా ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ రాష్ట్రంలో ఏకంగా పూర్తిగా మూసివేయడం జరిగింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య ఆర్ ఆర్ ఆర్ లాంటి భారీ బడ్జెట్ మూవీ విడుదల చేయడం వలన భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఓపెనింగ్స్ పై తీవ్ర ప్రభావం పడుతుంది. సాహసం చేసి విడుదల చేసినా… రోజుల వ్యవధిలో లాక్ డౌన్ ప్రకటిస్తే పూర్తిగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ […]

Written By:
  • Shiva
  • , Updated On : January 2, 2022 / 10:55 AM IST
    Follow us on

    RRR Postponement: తమిళనాడు, మహారాష్ట్రలో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ నడిపేలా ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ రాష్ట్రంలో ఏకంగా పూర్తిగా మూసివేయడం జరిగింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య ఆర్ ఆర్ ఆర్ లాంటి భారీ బడ్జెట్ మూవీ విడుదల చేయడం వలన భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఓపెనింగ్స్ పై తీవ్ర ప్రభావం పడుతుంది. సాహసం చేసి విడుదల చేసినా… రోజుల వ్యవధిలో లాక్ డౌన్ ప్రకటిస్తే పూర్తిగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

    makers-of-bheemla-nayak-refuse-to-back-off-from-sankranthi-release-race-001

    ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆర్ ఆర్ ఆర్ టీం… మూవీ విడుదల వాయిదా వేశారు. ఆర్ ఆర్ ఆర్ విడుదల వాయిదా సినీ ప్రేమికులతో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ని పూర్తి నిరాశకు గురి చేసింది. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని మాత్రం ఈ న్యూస్ ఆనందానికి గురి చేసింది. ఆర్ ఆర్ ఆర్ కారణంగా భీమ్లా నాయక్ సంక్రాంతి బరి నుండి తప్పుకున్న విషయం తెలిసిందే. జనవరి 12న విడుదల కావాల్సిన భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25కి వాయిదా పడింది. భీమ్లా నాయక్ విడుదల వాయిదాపై పవన్ ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దానికి కారణమైన ఆర్ ఆర్ ఆర్ మేకర్స్ ని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చేశారు.

    Also Read:  ‘పుష్ప’కి దూరంగా ఉంది అతనొక్కడే !

    నిన్న ఆర్ ఆర్ ఆర్ విడుదల వాయిదా వేస్తున్నట్లు అధికారిక ప్రకటన రావడంతో పవన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ న్యూస్ వాళ్లలో జోష్ నింపింది. ఆర్ ఆర్ ఆర్ వాయిదా నేపథ్యంలో భీమ్లా నాయక్ సంక్రాంతికి విడుదల అవుతుందనేది వారి ఆలోచన. ఆర్ ఆర్ ఆర్ విడుదల వాయిదా ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో భీమ్లా నాయక్ ట్రెండ్ అయ్యింది. చాలా మంది ఫ్యాన్స్ సంక్రాంతి బరిలో భీమ్లా నాయక్ అంటూ ప్రచారం చేశారు.

    అయితే వాళ్ళ ఆశలు మరలా ఆవియారయ్యాయి. భీమ్లా నాయక్ సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఎటువంటి హింట్ ఇవ్వలేదు. అలాగే భీమ్లా నాయక్ చిత్రాన్ని ఫ్రీఫోన్ చేసే ఆలోచన వాళ్లకు లేనట్లు తెలుస్తుంది. ఏపీలో టికెట్స్ ధరలు, థియేటర్స్ మూసివేత వంటి సమస్యలు ఉన్న నేపథ్యంలో చర్చలు జరుగుతున్నాయి. దీనిపై కొన్ని సానుకూల ఫలితాలు త్వరలో రావచ్చు. భీమ్లా నాయక్ సంక్రాంతికి విడుదల చేసి నష్టపోవడం కంటే.. ఫిబ్రవరికి విడుదల చేసుకోవడమే బెటర్ ని నిర్మాతల ఆలోచన కావచ్చు. ఈ లోపే ఏపీలో మూసివేసిన థియేటర్స్ పునరుద్ధరణ, టికెట్స్ ధరల పెంపు జరిగితే సంక్రాంతికి విడుదల చేసే ఆస్కారం కూడా కలదు. ప్రస్తుతానికి భీమ్లా నాయక్ సంక్రాంతి బరిలో దిగనున్నట్లు ఎటువంటి సమాచారం లేదు.

    Also Read: హీరో అవతారం ఎత్తుతున్న మరో కమెడియన్ !

    Tags