Revanth Reddy: సొంత మీడియా ఏర్పాటుకు రేవంత్ రెడ్డి రెడీయేనా?

Revanth Reddy: రాజకీయ పార్టీలకు మీడియా అద్దం లాంటిది. సొంత మీడియా లేకపోతే మనుగడ సాధ్యం కాదు. పార్టీ కార్యక్రమాలకు విరివిగా ప్రచారం కలగాలంటే మీడియా ఉండాల్సిందే. అందుకే టీపీసీసీ అధ్యక్షుడు ప్రస్తుతం ఓ కొత్త ఆలోచన చేస్తున్నారు. తనకు ఓ మీడియా ఉండాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఓ టీవీ చానల్ స్థాపించాలనే ఆలోచన చేస్తున్నారు. దీనికి గాను పెద్ద న్యూస్ చానళ్లను సంప్రదిస్తూ కష్టనష్టాలను తెలుసుకుంటున్నారు. ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నారు. ఇన్నాళ్లు కాంగ్రెస్ […]

Written By: Suresh, Updated On : January 2, 2022 10:42 am
Follow us on

Revanth Reddy: రాజకీయ పార్టీలకు మీడియా అద్దం లాంటిది. సొంత మీడియా లేకపోతే మనుగడ సాధ్యం కాదు. పార్టీ కార్యక్రమాలకు విరివిగా ప్రచారం కలగాలంటే మీడియా ఉండాల్సిందే. అందుకే టీపీసీసీ అధ్యక్షుడు ప్రస్తుతం ఓ కొత్త ఆలోచన చేస్తున్నారు. తనకు ఓ మీడియా ఉండాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఓ టీవీ చానల్ స్థాపించాలనే ఆలోచన చేస్తున్నారు. దీనికి గాను పెద్ద న్యూస్ చానళ్లను సంప్రదిస్తూ కష్టనష్టాలను తెలుసుకుంటున్నారు. ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నారు.

Revanth Reddy

ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా తగిన ప్రచారం జరగడం లేదని తెలుస్తోంది. ఇందుకు తనకూ ఓ సంస్థ ఉండాలని చూస్తున్నారు. మొదట ఓ యూట్యూబ్ చానల్ ప్రారంభించి దాన్నే ఇరవై నాలుగు గంటల చానల్ గా మార్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకు గాను అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల ప్రసారానికి పక్కా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Also Read:  కాంగ్రెస్ ను కట్టడి చేస్తున్న పార్టీలు.. ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డంకులు

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి పక్కా వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ప్రచారంలో మాత్రం తగినంత గుర్తింపు రాలేదని సమాచారం. అందుకే సొంత మీడియా నెలకొల్పి తమ వార్తలను నిరంతరం ప్రసారం చేసుకుంటూ ప్రజల్లో పట్టు సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. దీనికి మీడియాను అస్ర్తంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

ఇంత కాలం సొంత మీడియా లేకపోవడంతో ఇతర మీడియాలను అడుక్కుంటున్నా వారు మాత్రం పట్టించుకోలేదు. దీంతో పార్టీకి తగిన గుర్తింపు రాలేదు. తమ వార్తలను తామే ప్రచారం చేసుకోవాలనే ఉద్దేశంతో కొత్త చానల్ ఏర్పాటుకు మార్గం సుగమం చేసుకుంటున్నట్లు సమాచారం. కేసీఆర్ ను ఎదుర్కోవాలంటే సొంత మీడియా అవసరం ఎంతైనా ఉందని గుర్తిస్తున్నారు. ఏదిఏమైనా మీడియాలో కూడా మరో సంచలనం కావాలని రేవంత్ రెడ్డి ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Also Read:  సంజయ్ పాదయాత్రకు అనుకోని అవాంతరాలు..

Tags