Vande Mataram Movie: ‘నువ్వు రావాల్సిందే, తప్పదు’ అంటూ కృష్ణ ఆర్డర్ !

Vande Mataram Movie: అవి ‘వందేమాతరం’ సినిమా కథా చర్చలు జరుగుతున్న రోజులు. ఆ సినిమాకు ‘దర్శకుడు ముత్యాల సుబ్బయ్య’ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. మరోపక్క ఆ సినిమా స్క్రిప్ట్ ను టి. కృష్ణ గారు చాలా వేగంగా పూర్తి చేశారు. ఇక కథకు తగ్గ నటీనటులను ఎంపిక చేయడం మొదలుపెట్టారు. అసిస్టెంట్ డైరెక్టర్ కాబట్టి ఆ బాధ్యత సుబ్బయ్య మీద పడింది. అన్నీ పాత్రలకు నటులు దొరుకుతున్నారు గానీ, విలన్ పాత్రలకు మాత్రం […]

Written By: Shiva, Updated On : January 2, 2022 10:56 am
Follow us on

Vande Mataram Movie: అవి ‘వందేమాతరం’ సినిమా కథా చర్చలు జరుగుతున్న రోజులు. ఆ సినిమాకు ‘దర్శకుడు ముత్యాల సుబ్బయ్య’ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. మరోపక్క ఆ సినిమా స్క్రిప్ట్ ను టి. కృష్ణ గారు చాలా వేగంగా పూర్తి చేశారు. ఇక కథకు తగ్గ నటీనటులను ఎంపిక చేయడం మొదలుపెట్టారు. అసిస్టెంట్ డైరెక్టర్ కాబట్టి ఆ బాధ్యత సుబ్బయ్య మీద పడింది. అన్నీ పాత్రలకు నటులు దొరుకుతున్నారు గానీ, విలన్ పాత్రలకు మాత్రం సరైన నటులు దొరకడం లేదు. ఎంతమందిని పిలిపించి ఆడిషన్ తీసుకున్నా.. ఇంకా ఓ బలమైన విలన్‌ పాత్ర మిగిలే ఉంది.

Superstar Krishna

ఆ పాత్రకు అర్జెంట్ గా నటుడు కావాలి. దర్శకుడు టి. కృష్ణ గారు ‘ఈ పాత్రకు ఎవరిని పెట్టాలో అర్థం కావడం లేదు, ఎవరిని పెట్టుకుందాం సుబ్బయ్యా’’ అంటూ ముత్యాల సుబ్బయ్య వైపు చూశాడు. ‘ఒక స్టేజ్‌ ఆర్టిస్ట్‌ ఉన్నాడు సర్, పేరు కోట శ్రీనివాసరావు. బాగానే నటిస్తాడు’ అంటూ ముత్యాల సుబ్బయ్య, కోట గురించి చెప్పుకుంటూ పోయాడు.

పక్కన పి.ఎల్‌.నారాయణ కలుగజేసుకుని ‘అవును, ఆడు మంచి రంగస్థల నటుడు. బాగా చేస్తాడు’ అన్నాడు. ఆ రోజుల్లో టి. కృష్ణ గారికి కొత్త వాళ్లను ప్రోత్సహించాలనే తపన బాగా ఉండేది. అందుకు తగ్గట్టుగానే ఆయన ఎక్కువగా తన సినిమాల్లో కొత్తవాళ్లను పెట్టుకునే వాళ్ళు. అలా కోట శ్రీనివాసరావును పిలిపించి విలన్ పాత్రను ఇచ్చారు. అయితే, ఇక్కడే అసలు సమస్య మొదలైంది.

Also Read: నిజాయితీగా ఉండండి.. సమంత ఎమోషనల్ పోస్ట్ !

ఆ విలన్‌ వేషానికి ఒక సహాయకుడి పాత్ర కూడా ఉంది. ఆ పాత్రకు మాత్రం ఏ నటుడు సరిపోవడం లేదు. చివరి క్షణం వరకూ ఆ పాత్ర కోసం టి. కృష్ణ గారు ఎవరినీ ఎంపిక చేయలేదు. అదే సుబ్బయ్య భయం. షూటింగ్‌ డేట్‌ దగ్గర పడింది. ఉదయానే షూటింగ్ స్టార్ట్ అయింది. టి. కృష్ణ గారు ‘సుబ్బయ్యా ఇటు రా’ అని కేకలు వేశారు. పరిగెత్తుకుంటూ వచ్చే లోపే ‘ఆ విలన్ అసిస్టెంట్‌ రోల్ నువ్వు వేసెయ్‌’ అంటూ కూల్‌ గా చెప్పారు టి. కృష్ణ.

ముత్యాల సుబ్బయ్య అలాగే ఆశ్చర్యపోతూ నోరెళ్లబెట్టారు. బిత్తరపోయి మళ్ళీ తేరుకుని.. ‘నా వల్ల కాదు సర్’ అని కృష్ణగారికి చెప్పడానికి భయపడుతున్నారు. అంతలో టి. కృష్ణ గారు ‘సుబ్బయ్య ఆ వేషం కోసం నువ్వు రావాల్సిందే, తప్పదు’ అని వాయిస్ రైజ్ చేస్తూ ఆర్డర్ వేశారు. చివరకు ‘వందేమాతరం’ సినిమాలో ముత్యాల సుబ్బయ్య నటించారు. ఆయన వేషాన్ని పరిశీలిస్తే కొన్ని షాట్స్ లో మీసం పక్కకుపోయి ఉంటుంది. ఆసక్తి లేకుండా చేసిన వేషం కాబట్టి.. అలా జరిగి ఉండవచ్చు.

Also Read: విడిపోతూ కూడా ప్రేమను కురిపించేస్తే ఎలా ?

Tags