https://oktelugu.com/

కనిపించని శత్రువుతో అలుపెరుగని పోరాటం!

కొంచం కష్టమైనా పర్వాలేదు కనిపించే శత్రువుతో పోరాడవచ్చు, కానీ కనిపించని శత్రువుతో పోరాడటం అంత తేలికైన పని కాదు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు కనిపించని శత్రువు తో పోరాడుతున్నాయి. ఈ పోరాటంలో అత్యంత సంపన్న దేశాలు బెంబేలెత్తి పోతున్నాయి. ఈ పోరాటంలో నిత్యా మృత్యు ఘోష తప్పటం లేదు అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, వంటి దేశాలలో మరణాల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నాయి అమెరికాలో గడిచిన 24 గంటల్లో 2,108 చనిపోయారు. ఈ క్రమంలో మరణించిన వారి సంఖ్య […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 12, 2020 / 10:46 AM IST
    Follow us on

    కొంచం కష్టమైనా పర్వాలేదు కనిపించే శత్రువుతో పోరాడవచ్చు, కానీ కనిపించని శత్రువుతో పోరాడటం అంత తేలికైన పని కాదు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు కనిపించని శత్రువు తో పోరాడుతున్నాయి. ఈ పోరాటంలో అత్యంత సంపన్న దేశాలు బెంబేలెత్తి పోతున్నాయి. ఈ పోరాటంలో నిత్యా మృత్యు ఘోష తప్పటం లేదు అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, వంటి దేశాలలో మరణాల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నాయి అమెరికాలో గడిచిన 24 గంటల్లో 2,108 చనిపోయారు. ఈ క్రమంలో మరణించిన వారి సంఖ్య 19 వేలు దాటగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య ఐదు లక్షలు దాటింది. బ్రిటన్ లోని నిన్న ఒక్కరోజే 917 మంది చనిపోగా అక్కడ బాధితుల సంఖ్య పదివేలకు చేరువైంది. బెల్జియం, స్పెయిన్, నెదర్లాండ్ వంటి దేశాలలో ఒక్కరోజులోనే వందల సంఖ్య లో బలైపోతున్నారు. బ్రెజిల్లో మరణించిన వారి సంఖ్య 1000 మార్కు దాటింది. అలాగే సింగపూర్ లో నిన్ను ఒక్క రోజే 191 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అక్కడ ఎక్కువ మంది భారతీయులే కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటివరకు 51 మంది భారతీయులు కరోనా ఇబ్బంది పడుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. దేశానికో విషాద గాధ లు భయటపడతాయి.

    ఇక మన దేశం విషయానికి వస్తే.. కంటికి కనిపించని కరోనా మహమ్మారి దెబ్బతో యావత్ భారతావని అతలాకుతలం అవుతుంది. దేశంలో కొవిడ్‌-19 బారినపడ్డవారి సంఖ్య 8,356కు పెరిగింది. గత 24 గంటల్లో 909 కొత్త కేసులు నమోదుకాగా, 34 మంది మృతిచెందారు. ఇక ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 273కు పెరిగింది. రోజురోజుకీ ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో లాక్‌ డౌన్‌ ను మరికొన్ని రోజుల పాటు పొడిగించాలని వివిధ రాష్ట్రాలు నిర్ణయించిన విషయం తెలిసిందే. కేంద్రంతో సంబంధం లేకుండా ప్రతీ రాష్ట్రమూ లాక్‌ డౌన్‌ ను పొడిగించేస్తున్నాయి. పంజాబ్‌, ఒడిసా ఇప్పటికే ప్రకటించగా- తాజాగా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌, పశ్చిమబెంగాల్‌ కూడా ఈనెల 30 దాకా లాక్‌ డౌన్‌ ను పొడిగిస్తున్నట్లు వెల్లడించాయి.