https://oktelugu.com/

కరోనా పోకడతో కాపుసారా పడగ!

కరోనా మహమ్మారి విపత్తు, లాక్ డౌన్ దెబ్బతో మద్యం షాపులు, బార్లు మూతపడడంతో మందుబాబుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇదే అదునుగా తీసుకున్న కాపుసారా, గుడుంబా వ్యాపారులు పెట్రేగిపోతున్నారు. వైరస్ సాకును చూపించి తమ బస్తీల్లోకి అధికారులు రావొద్దంటూ కర్రలు, రాళ్లను అడ్డుగా పెట్టి మరీ గుడుంబా తయారు చేస్తున్నారు. కావాల్సిన వారు ఫోన్ చేస్తే ఇంటికే సరుకు పంపుతున్నారు. వైన్స్ షాపులు మూతపడగా గ్రామీణ ప్రాంతాలు, తండాల్లో గుడుంబా తయారీ ఊపందుకుంది. అయితే ఎక్సైజ్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 30, 2020 12:46 pm
    Follow us on

    కరోనా మహమ్మారి విపత్తు, లాక్ డౌన్ దెబ్బతో మద్యం షాపులు, బార్లు మూతపడడంతో మందుబాబుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇదే అదునుగా తీసుకున్న కాపుసారా, గుడుంబా వ్యాపారులు పెట్రేగిపోతున్నారు. వైరస్ సాకును చూపించి తమ బస్తీల్లోకి అధికారులు రావొద్దంటూ కర్రలు, రాళ్లను అడ్డుగా పెట్టి మరీ గుడుంబా తయారు చేస్తున్నారు. కావాల్సిన వారు ఫోన్ చేస్తే ఇంటికే సరుకు పంపుతున్నారు. వైన్స్ షాపులు మూతపడగా గ్రామీణ ప్రాంతాలు, తండాల్లో గుడుంబా తయారీ ఊపందుకుంది. అయితే ఎక్సైజ్ అధికారుల తనిఖీలు ముమ్మరం కావడంతో సమీపంలోని పలు ప్రాంతాలను ఎంచుకొని డ్రమ్ముల్లో బెల్లాన్ని నానబెట్టి గుడుంబా తయారు చేస్తున్నారు. హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దూల్ పేట్ లో 20 రోజుల్లో 11 ప్రాంతాల్లో గుడుంబా తయారు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. వందల లీటర్ల కాపుసారా, గుడుంబాను, గ్యాస్ సిలిండర్లు, సామగ్రిని పెద్ద ఎత్తున సీజ్ చేశారు.

    రాష్ట్రంలో గుడుంబా తయారీని సహించేది లేదని.. గుడుంబా తయారీదారులపై ఉక్కుపాదం మోపాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో కూడా గుడుంబా తయారుకాకుండా పక్కాగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గుడుంబా తయారీదారులను, బెల్లం అమ్మకందారులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. క్షేత్రస్థాయిలో అధికారులు ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని, అలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆబ్కారీ జిల్లాల అధికారులు ప్రతి రోజూ తమ సిబ్బంది నుంచి వివరాలు తీసుకుని, ఆ నివేదికలను తనకు పంపాలని ఆదేశించారు. లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా ఎవరూ వ్యవహరించినా ఊరుకోవద్దని.. మద్యం అమ్మకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని.. అవసరమైతే షాపుల లైసెన్సులు రద్దు చేయాలని చెప్పారు. గుడుంబాపై ఉక్కుపాదం మోపాలని, తయారీదారులపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీసులతో కలిసి తండాల్లో తనిఖీలు నిర్వహించాలని సూచించారు.

    కాపు సారా, గుడుంబా తయారీ, అమ్మకందారులపై 1,922 కేసులు పెట్టి 8,091 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకొన్నామని.. అక్రమంగా మద్యం అమ్మేవారిపై 743 కేసులు పెట్టి 777 మందిని అరెస్ట్ చేసినట్టు అధికారులు మంత్రికి తెలిపారు. సీఎం కేసీఆర్ పట్టుదల, నిబద్ధతతో రాష్ట్రం గుడుంబా రహితంగా మారిందని.. ఆ ఇమేజ్ పోతే సహించేది లేదని చెప్పారు.