అధునాతన దశల్లో నాలుగు వ్యాక్సిన్లు

దేశంలో కరోనాఉధృతి కొనసాగుతున్న తరుణంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి హర్షవర్ధన్ ఊరటనిచ్చే అంశాన్ని వెల్లడించారు. దేశంలో నాలుగు కంటే ఎక్కువ వ్యాక్సిన్లు ప్రీ-క్లినికల్ ట్రయల్స్ అధునాతన దశలో ఉన్నాయని కేంద్రమంత్రి ప్రకటించారు. కోవిడ్-19 మహమ్మారిపై పార్లమెంటులో ఆదివారం జరిగిన చర్చ సందర్భంగా కేంద్రమంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు.  కరోనాపై పోరులో భాగంగా 30 టీకాలకు ప్రభుత్వం మద్దతు ఇస్తోందన్నారు. వీటిలో ప్రీ-క్లినికల్ ప్రయోగాల్లో అధునాతన దశల్లో నాలుగు, ఫేజ్-1, 2, 3 దశల  ప్రయోగాల అడ్వాన్స్ డ్ స్టేజ్ లో మూడు […]

Written By: NARESH, Updated On : September 21, 2020 9:45 pm

covid vaccine

Follow us on

దేశంలో కరోనాఉధృతి కొనసాగుతున్న తరుణంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి హర్షవర్ధన్ ఊరటనిచ్చే అంశాన్ని వెల్లడించారు. దేశంలో నాలుగు కంటే ఎక్కువ వ్యాక్సిన్లు ప్రీ-క్లినికల్ ట్రయల్స్ అధునాతన దశలో ఉన్నాయని కేంద్రమంత్రి ప్రకటించారు. కోవిడ్-19 మహమ్మారిపై పార్లమెంటులో ఆదివారం జరిగిన చర్చ సందర్భంగా కేంద్రమంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు.  కరోనాపై పోరులో భాగంగా 30 టీకాలకు ప్రభుత్వం మద్దతు ఇస్తోందన్నారు. వీటిలో ప్రీ-క్లినికల్ ప్రయోగాల్లో అధునాతన దశల్లో నాలుగు, ఫేజ్-1, 2, 3 దశల  ప్రయోగాల అడ్వాన్స్ డ్ స్టేజ్ లో మూడు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

ముఖ్యంగా హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, అహ్మదాబాద్‌కు చెందిన జైడస్ కాడిల్లా ప్రయోగ ఫలితాలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. దేశంలో కోవిడ్-19 వ్యాక్సిన్ రేసులో ముందున్న వారిలో భారత్ బయోటెక్ కోవాక్సిన్ ఒకటి. అలాగే పూణేకు చెందిన సీరం ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ప్రయోగాలు కూడా కీలక దశలో ఉన్న సంగతి తెలిసిందే.

Also Read : తెలంగాణ టీడీపీలో తిరుగుబాటు.. చంద్రబాబుకు షాక్