
పార్కింగ్ విషయంలో గొడవపడి, యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించి , చేయిచేసుకున్న కార్పోరేటర్ ను సైబరాబాద్ పోలిసులు అరెస్టు చేశారు. చందానగర్ పోలిస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీవిహార్ ఫేజ్-2, నల్లగండ్ల విల్లా నంబర్-43 లో శేరిలింగపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కుటుంబం నివాపముంటోంది. అదే లక్ష్మీవిహర్ లోని విల్లా నంబర్-18 లో బాధితురాలి కుటుంబం నివాసముంటోంది. ఈ నెల 12న రాత్రి 10.30 గంటలకు పార్కింగ్ విషయంలో ఆయువతి, కార్పోరేటర్ కు మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. క్షణికావేశానికి లోనైన కార్పోరేటర్ ఆయువతి చేయిచేసుకున్నాడు. బాధితురాలు పోలిసులను ఆశ్రయించింది. కేసు దర్యాప్తు చేసి చందానగర్ పోలిసులు కార్పోరేటర్ ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. అనంతరం ఆయన బెయిల్ పై విడుదలైనట్లు తెలిసింది.