https://oktelugu.com/

సీఎం కేసీఆర్‌‌ మరో కీలక నిర్ణయం

రెవెన్యూ శాఖలో అవినీతి పెరిగిపోతుండడంతో ఈ మధ్య తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌‌ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే వీఆర్వో వ్యవస్థను రద్దు చేయగా.. రెవెన్యూ శాఖలో పలు మార్పులు చేపట్టారు. నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చారు. తాజాగా స్టాంపు డ్యూటీ వసూళ్లకు సంబంధించి అధికారుల విచక్షణాధికారాలకు కోత పెట్టాలనే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ‘ఇండియన్‌ స్టాంపు యాక్ట్‌-1899’కు సవరణలు చేసి రాష్ట్రపతి ఆమోదం […]

Written By:
  • NARESH
  • , Updated On : September 22, 2020 / 11:55 AM IST

    Will KCR end corruption with the new Revenue Act..?

    Follow us on

    రెవెన్యూ శాఖలో అవినీతి పెరిగిపోతుండడంతో ఈ మధ్య తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌‌ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే వీఆర్వో వ్యవస్థను రద్దు చేయగా.. రెవెన్యూ శాఖలో పలు మార్పులు చేపట్టారు. నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చారు. తాజాగా స్టాంపు డ్యూటీ వసూళ్లకు సంబంధించి అధికారుల విచక్షణాధికారాలకు కోత పెట్టాలనే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ‘ఇండియన్‌ స్టాంపు యాక్ట్‌-1899’కు సవరణలు చేసి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించాలని చూస్తున్నట్లు సమాచారం.

    Also Read: సీఎం జగన్ పై మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణ

    ఆ సవరణను రాష్ట్రపతికి పంపించేందుకు ముందే ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి గవర్నర్‌‌ ఆమోదం కోసం పంపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇండియన్‌ స్టాంప్‌ యాక్ట్‌-1899లోని సెక్షన్‌ 47(ఏ) ప్రకారం భూమి విలువ బహిరంగ మార్కెట్ కంటే ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ విలువ (రిజిస్ట్రేషన్ వాల్యూ) ఎక్కువగా ఉంటే.. సదరు భూ యజమాని సబ్-రిజిస్ట్రార్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. భూమి విలువను తగ్గించమని, ఆ ప్రకారమే స్టాంప్ డ్యూటీని వసూలు చేయమని కోరవచ్చు. దరఖాస్తును పరిశీలించాక సబ్ రిజిస్ట్రార్ దాన్ని జిల్లా రిజిస్ట్రార్(డీఆర్)కు పంపిస్తాడు. అక్కడి నుంచి రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌(ఐజీ) వద్దకు వెళ్తుంది. ఐజీకి ఉండే విచక్షణాధికారాలతో రిజిస్ట్రేషన్ వాల్యూని తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవచ్చు.

    ఐజీ ఆమోదం పొందాక ఆయన నిర్ణయించిన ధర ప్రకారం సబ్‌ రిజిస్ట్రార్‌‌ స్టాంప్‌ డ్యూటీ వసూలు చేస్తారు. గతంలో ఈ అధికారం జాయింట్‌ కలెక్టర్లు, ఆర్డీవోలకు ఉండేది. వారిపై పని ఒత్తిడి ఎక్కువగా ఉండడంతో ఆ బాధ్యతలను జిల్లా రిజిస్ట్రార్లకు బదిలీ చేశారు. పలు సందర్భాల్లో డీఆర్‌‌లు కూడా సబ్‌ రిజిస్ట్రార్లతో కుమ్మక్కై మార్కెట్‌ వ్యాల్యూని భారీగా తగ్గించి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారట. ఇటీవల మియాపూర్‌‌ భూ కుంభకోణంలోనూ ఇదే విషయం వెలుగులోకి వచ్చింది. అందుకే.. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.

    Also Read: రాజధాని బిల్లులు ఆమోదం పొందినట్లే

    ఐజీల అధికారాలను కూడా తొలగించాలని ప్రభుత్వం చూస్తోందట. ముందుగా ఇండియన్‌ స్టాంప్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 47(ఏ)కు సవరణ చేసి గవర్నర్‌కు పంపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇది కేంద్ర పరిధిలోని చట్టం కావడంతో ముందు శాసనసభ సమావేశాల్లో బిల్లును పెట్టి ఆమోదించే అవకాశం ఉంది. తర్వాత రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిస్తారు. అయితే ఈ చట్ట సవరణను కేంద్ర హోంశాఖ పరిశీలించి ఆమోదిస్తేనే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తారని నిపుణులు చెబుతున్నారు.