ఉద్యోగులకు బలవంతపు సెలవులు!

కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ శాఖల ఉద్యోగులకు బలవంతపు సెలవులు ఇస్తున్నారు. ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు వారి వారి ఉద్యోగులకు ఈ నెల 31 వరకు సెలవులను మంజూరు చేశాయి. కరోనా వ్యాప్తిని అరికటేందుకు ఐటీ ఉద్యోగస్థులందరు ఇంటి దగ్గర నుండే వర్క్ చేసే విధంగా తగిన ఉత్తరువులు జారీ చేశాయి. భారత్ లోని దాదాపు 10వేల ఉద్యోగులకు ఇంటి నుండే పనిచేయవల్సిందిగా వాహన దిగ్గజ సంస్థ ఫోర్డ్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. […]

Written By: Neelambaram, Updated On : March 18, 2020 12:45 pm
Follow us on

కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ శాఖల ఉద్యోగులకు బలవంతపు సెలవులు ఇస్తున్నారు. ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు వారి వారి ఉద్యోగులకు ఈ నెల 31 వరకు సెలవులను మంజూరు చేశాయి. కరోనా వ్యాప్తిని అరికటేందుకు ఐటీ ఉద్యోగస్థులందరు ఇంటి దగ్గర నుండే వర్క్ చేసే విధంగా తగిన ఉత్తరువులు జారీ చేశాయి. భారత్ లోని దాదాపు 10వేల ఉద్యోగులకు ఇంటి నుండే పనిచేయవల్సిందిగా వాహన దిగ్గజ సంస్థ ఫోర్డ్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక మేనేజ్మెంట్ విద్యా సంస్ధ ఇండియన్ స్కూల్ అఫ్ బిజినెస్ (ఐఎస్బి) విద్యార్థులకు క్లాసులు రద్దు చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి గాను మిగిలిన క్లాసులను ఆన్ లైన్ లో నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. అంతే కాకుండా కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావం బ్యాంకులపై కూడా పడింది. ఇండియన్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంకుల బోర్డు సమావేశాలను వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

వివిధ సంస్థలు స్వచ్చందంగా సెలవులు తీసుకోవాలని సిబ్బందిని కోరడంతో పాటు ఉద్యోగ కాంట్రాక్టులను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నాయి. కొత్త నియమాలు, నిబంధనలతో పనిగంటలు సాధ్యమైనంత తగ్గిస్తున్నాయి. మరోవైపు కరోనాని నియంత్రించడం కోసం తెలంగాణ ప్రభుత్వం అధికారులను అప్రమతం చేసింది. అదే సమయంలో పాఠశాలలు, పార్కులు, సినిమాహాళ్లు, మ్యూజియాలు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అటు ఉద్యోగులకు, ఇటు విద్యార్థులకు బలవంతపు సెలవులు మంజూరు చేయడంతో జంట నగరాలలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారి పోయాయి. కరోనా భయంతో ప్రజలందరు వారి వారి ఇండ్లకే పరిమితం కావడంతో పార్కులు, సినిమాహాళ్లు, మ్యూజియాలు బోసి కొడుతున్నాయి.

ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 137కరోనా కేసులు నమోదు కాగా అందులో నాలుగురు మరణించినట్లు వైద్య శాఖా వెల్లడించింది. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఎవరికి వారు బాధ్యతో, నిబద్దతతో కృషి చేయాలని వైద్య, ఆరోగ్య శాఖా ఒక ప్రకటనలో తెలిపింది.