పాఠశాలలు మూసారు … బార్లు మూయరా!

కరోనా వైరస్ ముప్పును ఎదుర్కోవడం కోసం తెలంగాణ ప్రభుత్వం దాదాపు బంద్ పాటిస్తున్నది. పాఠశాలల నుండి యూనివర్సిటీల వరకు మూసివేశారు. సినిమాహాళ్లు, పబ్బులు, బార్లు బంద్ చేశారు. చివరకు అసెంబ్లీ సమావేశాలను సహితం కుదించివేసారు. అనేక ఐటి కంపెనీలు సహితం ఉద్యోగులను ఆఫీస్ లకు రావద్దని అంటూ ఇంటి నుండే పనిచేయమని కోరుతున్నాయి. కానీ మద్యం షాపులు, బార్లు మాత్రం యధావిధిగా కొనసాగుతున్నాయి. మద్యం షాపులు ప్రభుత్వ ప్రధాన ఆదాయ మార్గాలే కావడం కాకుండా, వీటిల్లో చాలావాటి […]

Written By: Neelambaram, Updated On : March 18, 2020 1:43 pm
Follow us on

కరోనా వైరస్ ముప్పును ఎదుర్కోవడం కోసం తెలంగాణ ప్రభుత్వం దాదాపు బంద్ పాటిస్తున్నది. పాఠశాలల నుండి యూనివర్సిటీల వరకు మూసివేశారు. సినిమాహాళ్లు, పబ్బులు, బార్లు బంద్ చేశారు. చివరకు అసెంబ్లీ సమావేశాలను సహితం కుదించివేసారు.

అనేక ఐటి కంపెనీలు సహితం ఉద్యోగులను ఆఫీస్ లకు రావద్దని అంటూ ఇంటి నుండే పనిచేయమని కోరుతున్నాయి. కానీ మద్యం షాపులు, బార్లు మాత్రం యధావిధిగా కొనసాగుతున్నాయి. మద్యం షాపులు ప్రభుత్వ ప్రధాన ఆదాయ మార్గాలే కావడం కాకుండా, వీటిల్లో చాలావాటి యజమానులు రాజకీయంగా పలుకుబడి గలవారు, అధికార పార్టీ నేతలకు సన్నిహితులు కావడంతో ప్రభుత్వం వాటి జోలికి రావడం లేదని చెబుతున్నారు.

ప్రభుత్వ, ప్రైవేట్ విద్య సంస్థలు అన్నిన్నిట్నీ మూసివేయిస్తున్న ప్రభుత్వం నారాయణ, శ్రీ చైతన్య వంటి కార్పొరేట్ విద్యాసంస్థలకు మాత్రం మినహాయింపు ఇవ్వడం విస్మయం కలిగిస్తున్నది. ఈ సంస్థల నుండి ప్రభుత్వంలోని పెద్దలకు భారీ ముడుపులు అందుతూ ఉండడంతో వాటి విద్య వ్యాపారానికి ప్రభుత్వం అడ్డం రాదలచుకోవడం లేదని విమర్శలు చెలరేగుతున్నాయి.