https://oktelugu.com/

సీసీసీకి నిర్మాత మోహ‌న్ చెరుకూరి విరాళం

మెగాస్టార్ చిరంజీవి ఆధ్వ‌ర్యంలో న‌డుస్తోన్న క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కి ప్ర‌ముఖ నిర్మాత మోహ‌న్ చెరుకూరి రూ. 5 ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించారు. షూటింగ్‌లు లేక ఉపాధి క‌రువై ఇబ్బందులు ప‌డుతున్న సినీ కార్మికులను సీసీసీ ఆదుకుంటున్న తీరు అభినంద‌నీయ‌మ‌నీ, అందులో త‌నూ భాగం కావాల‌నే ఉద్దేశంతో త‌న వంతుగా ఈ విరాళం అందిస్తున్నాన‌నీ ఆయ‌న చెప్పారు. క‌రోనా ఉధృతిని అరిక‌ట్ట‌డానికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తున్నాయ‌నీ, వైద్య సిబ్బంది, పోలీసులు అద్భుతంగా త‌మ విధుల‌ను […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 18, 2020 / 03:30 PM IST
    Follow us on


    మెగాస్టార్ చిరంజీవి ఆధ్వ‌ర్యంలో న‌డుస్తోన్న క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కి ప్ర‌ముఖ నిర్మాత మోహ‌న్ చెరుకూరి రూ. 5 ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించారు. షూటింగ్‌లు లేక ఉపాధి క‌రువై ఇబ్బందులు ప‌డుతున్న సినీ కార్మికులను సీసీసీ ఆదుకుంటున్న తీరు అభినంద‌నీయ‌మ‌నీ, అందులో త‌నూ భాగం కావాల‌నే ఉద్దేశంతో త‌న వంతుగా ఈ విరాళం అందిస్తున్నాన‌నీ ఆయ‌న చెప్పారు. క‌రోనా ఉధృతిని అరిక‌ట్ట‌డానికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తున్నాయ‌నీ, వైద్య సిబ్బంది, పోలీసులు అద్భుతంగా త‌మ విధుల‌ను అహ‌ర్నిశ‌లూ నిర్వ‌హిస్తున్నారనీ ఆయ‌న కొనియాడారు.

    అలాగే ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో మ‌న ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచ‌డానికి పారిశుద్ధ్య కార్మికులు నిరంత‌రం శ్ర‌మించ‌డం గొప్ప విష‌య‌మ‌ని మోహ‌న్ అన్నారు. ప్ర‌భుత్వ యంత్రాంగాలు చేస్తున్న ఈ కృషికి త‌గ్గ‌ట్లు పౌరులుగా మనంద‌రం మ‌న ఇళ్ల‌ల్లోనే క్షేమంగా ఉంటూ క‌రోనా వ్యాప్తిని అడ్డుకోవ‌డంలో మ‌న వంతు పాత్ర పోషించాల‌ని ఆయ‌న కోరారు.