సీఎం సార్.. పాల కంటే నీళ్ళే మేలుగా..!

“పరుగెత్తి పాలు తాగే కంటే.. నిలబడి నీళ్ళు తాగడం మేలు” అనే విషయాన్ని ఏపీ సీఎం జగన్ కొంచం ఆలస్యంగా గ్రహించారు. శాసన మండలి రద్దు విషయంలో ఒక సత్యాన్ని గ్రహించిన జగన్, ఇప్పుడు మండలి రద్దు అంశంపై వెనకడుగు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ శాసన మండలి రద్దు చేయాలని భావించి అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో ప్రస్తుత పరిణామాలను చూస్తే శాసన మండలి రద్దు అనే కీలక విషయంలో […]

Written By: Neelambaram, Updated On : June 26, 2020 1:13 pm
Follow us on

“పరుగెత్తి పాలు తాగే కంటే.. నిలబడి నీళ్ళు తాగడం మేలు” అనే విషయాన్ని ఏపీ సీఎం జగన్ కొంచం ఆలస్యంగా గ్రహించారు. శాసన మండలి రద్దు విషయంలో ఒక సత్యాన్ని గ్రహించిన జగన్, ఇప్పుడు మండలి రద్దు అంశంపై వెనకడుగు వేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఏపీ శాసన మండలి రద్దు చేయాలని భావించి అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో ప్రస్తుత పరిణామాలను చూస్తే శాసన మండలి రద్దు అనే కీలక విషయంలో జగన్ వెనక్కి తగ్గినట్లు అర్థమవుతుంది. అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన గాని శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ సభ్యులు మెజార్టీ లో ఉండటంతో చాలా బిల్లులు అడ్డుకోవడం జరిగింది. దీంతో పెద్దల సభ అంటూ సలహాలు ఇవ్వాల్సింది పోయి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంటున్న శాసన మండలి రద్దు చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై ప్రతిపక్ష టీడీపీ కి మరియు అధికార పార్టీ వైసిపికి తీవ్ర వాదోపవాదాలు కూడా జరిగాయి. అయితే ప్రస్తుత పరిణామాలు బట్టి చూస్తే వచ్చే ఏడాదిలో శాసన మండలిలో వైసిపి పార్టీకి పూర్తి మెజార్టీ స్థానాలు వచ్చే అవకాశం ఉండటంతో… ఆఖరి నిమిషంలో ఇటీవల శాసన మండలి రద్దు విషయంలో వైఎస్ జగన్ పునరాలోచనలో పడినట్లు టాక్ నడుస్తోంది. ఈ ఒక్క సంవత్సరం కొన్ని కీలక బిల్లులను వాయిదా వేసి, శాసన మండలిలో కూడా వైసీపీ మెజారిటీ సభ్యలు చేరిన తర్వాత ఆ బిల్లులను ప్రవేశపెట్టె ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా.. కొన్ని నిర్ణయాలు తొదరపాటుతో తీసుకొని మళ్ళీ వాస్తవాలను గ్రహించడం వైసీపీ కి అనుకూల పరిణామమే..!