https://oktelugu.com/

చికెన్ ధర ‘న భూతో-న భవిష్యత్’!

కరోనా ఇచ్చిన బలమో, ప్రజలలో ఉన్న బలహీనతో తెలియదుగానీ ప్రస్తుతం కోడి ధర ‘న భూతో న భవిష్యత్’ అయింది. మునుపెన్నడూ లేనివిధంగా, ఇక భవిష్యత్ లో కూడా ఇంత ఉండదేమో అన్నంతగా చికెన్ రేట్ పెరిగింది. రెండు నెలల కిందట చికెన్‌ తింటే కరోనా సోకుతుందన్న ప్రచారంతో కొనేవాడే లేక అత్యల్పంగా కిలో రూ. 50కే పడిపోయి, కొన్ని చోట్ల ఫ్రీ గా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత ప్రజల్లో అపోహలు తొలగడంతో మాంసం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 15, 2020 / 02:04 PM IST
    Follow us on

    కరోనా ఇచ్చిన బలమో, ప్రజలలో ఉన్న బలహీనతో తెలియదుగానీ ప్రస్తుతం కోడి ధర ‘న భూతో న భవిష్యత్’ అయింది. మునుపెన్నడూ లేనివిధంగా, ఇక భవిష్యత్ లో కూడా ఇంత ఉండదేమో అన్నంతగా చికెన్ రేట్ పెరిగింది.
    రెండు నెలల కిందట చికెన్‌ తింటే కరోనా సోకుతుందన్న ప్రచారంతో కొనేవాడే లేక అత్యల్పంగా కిలో రూ. 50కే పడిపోయి, కొన్ని చోట్ల ఫ్రీ గా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత ప్రజల్లో అపోహలు తొలగడంతో మాంసం వినియోగం పెరిగింది. అలా 15 రోజుల కిందట రూ. 200కు, వారం కిందట రూ. 250కి చేరింది. అదిప్పుడు ఏకంగా రూ. 310కి పెరిగింది. బ్రాయిలర్‌ కోళ్ల చరిత్రలో ఇదే రికార్డు ధర.

    ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలలో కిలో చికెన్‌ అత్యధిక (రెండేళ్ల కిందట) ధర రూ. 260 పలికింది. ఇదే ఇప్పటివరకు ఉన్న రికార్డు. ఇప్పుడు ఆ రికార్డు చెరిగిపోయింది. కిలో రూ. 310 అనేది దేశంలోకెల్లా అత్యధిక ధర కావడం గమనార్హం. ప్రస్తుతం లాక్‌డౌన్‌ వల్ల పెద్ద, చిన్న హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, రోడ్డు పక్కన దుకాణాలూ మూతపడ్డాయి. అవి కూడా తెరచి ఉంటే చికెన్‌ ధర మరింత పెరిగేదని చికెన్‌ సెంటర్ల నిర్వాహకులు చెబుతున్నారు.