https://oktelugu.com/

వామ్మో.. చికెన్ ధర ఇంత పెరిగిందా!

దేశ వ్యాప్తంగా కరోనా రక్కసి పై పుట్టుకొచ్చిన వదంతుల్లో ఒకటి “చికెన్ తింటే కరోనా వస్తుంది”. అయితే అది తప్పుడు ప్రచారం అని తేలాడంతో.. చికెన్ ట్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. రెండు వారాల క్రితంతో పోలిస్తే ఐదింతలు పెరిగాయి. గుడ్డు కూడా 5రూపాయలకు చేరింది. కరోనా పుకార్లతో మార్చిలో చికెన్‌‌‌‌‌‌‌‌ రేట్లు ఒక్కసారిగా పడిపోయాయి. తినేందుకే జనం పెద్దగా ఆసక్తి చూపలేదు. కొన్ని జిల్లాల్లో కోళ్లు ఫ్రీగా కూడా ఇచ్చారు. మరికొన్నిచోట్ల పాతిపెట్టారు . ఈ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 6, 2020 / 11:32 AM IST
    Follow us on

    దేశ వ్యాప్తంగా కరోనా రక్కసి పై పుట్టుకొచ్చిన వదంతుల్లో ఒకటి “చికెన్ తింటే కరోనా వస్తుంది”. అయితే అది తప్పుడు ప్రచారం అని తేలాడంతో.. చికెన్ ట్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. రెండు వారాల క్రితంతో పోలిస్తే ఐదింతలు పెరిగాయి. గుడ్డు కూడా 5రూపాయలకు చేరింది. కరోనా పుకార్లతో మార్చిలో చికెన్‌‌‌‌‌‌‌‌ రేట్లు ఒక్కసారిగా పడిపోయాయి. తినేందుకే జనం పెద్దగా ఆసక్తి చూపలేదు. కొన్ని జిల్లాల్లో కోళ్లు ఫ్రీగా కూడా ఇచ్చారు. మరికొన్నిచోట్ల పాతిపెట్టారు .

    ఈ రెండు నెలల వ్యవధిలో పౌల్ట్రీ పరిశ్రమకు దాదాపు రూ.1500 కోట్ల నష్టం వాటిల్లింది. ప్రస్తుతం ఆ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారింది. చికెన్‌‌‌‌‌‌‌‌ తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేయడం, జనం కూడా ఇండ్లల్లోనే ఉంటుండడంతో గిరాకీ ఊపందుకుంది. ఆదివారం హైదరాబాద్ లోని చికెన్ సెంటర్ల దగ్గర  జనం బారులు దీరారు. గతంలో స్కిన్‌‌‌‌‌‌‌‌ లెస్‌‌‌‌‌‌‌‌ కిలో రూ.40 ఉండగా, తాజాగా రూ.230 వరకు అమ్ముతున్నారు. విత్‌ స్కిన్‌ ‌‌‌‌‌‌‌కిలో రూ.200, లైవ్‌‌‌‌‌‌‌‌ 100 నుంచి 120 వరకు విక్రయిస్తున్నారు. గుడ్డు ధరలు కూడా అమాంతం పెరిగాయి. లాక్‌‌‌‌‌‌‌‌ డౌన్‌‌‌‌‌‌‌‌ ప్రారంభంలో ఒక్క గుడ్డు రూ.3 ఉండగా, ప్రస్తుతం రూ.5 పలుకుతోంది. ఈ ధరలు రానున్న రోజుల్లో మరింతగా పెరిగే చాన్సెస్ కనిపిస్తున్నాయి. మరోవైపు మటన్‌‌‌‌‌‌‌‌ ₹700 నుంచి ₹ 850కి పెరిగింది. మాంసం ధరలు పెరగకుండా చూస్తామని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌ ప్రకటించినా, ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకున్నట్లు కనిపించడం లేదు.

    దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌‌‌‌‌‌‌‌ డౌన్‌‌‌‌‌‌‌‌ విధించడంతో… జనజీవనం, రవాణా స్తంభించింది. అత్యవసర సరుకులను మాత్రమే అనుమతిస్తున్నారు. దాంతో కోళ్లు , మేకలు, గొర్రెల ట్రాన్స్ ‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ తగ్గిపోయింది. లాక్‌‌‌‌‌‌‌‌ డౌన్‌‌‌‌‌‌‌‌ కు ముందు పెద్దఎత్తున కోళ్లను పాతిపెట్టారు. ఆ తర్వాత కూడా పౌల్ట్రీల్లో పెద్దగా పెంపకం చేపట్డడంలేదు. ఇలా డిమాండ్ మేరకు సప్లయ్ లేక ధరలు ఒక్కసారిగా పెరిగాయి. తక్కువ మొత్తంలో కోళ్లు , మేకలు ఉండటంతో ఎక్కువ ధరకు అమ్ముతున్నామని, ఇప్పటికే కరోనా ప్రభావంతో పెద్దఎత్తున నష్టపోయామని వ్యాపారులు చెబుతున్నారు.