కరోనా మీద ఐక్య పోరాటానికి చిహ్నం..

కరోనా వైరస్‌ మీద జరుగుతున్న పోరాటానికి సంఘీభావం తెలుపుతూ దీపాలు వెలిగించాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుమేరకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ ఈ రాత్రి తొమ్మిది గంటలకు తన నివాసంలో కొవ్వొత్తులు వెలిగించారు. సరిగ్గా తొమ్మిది గంటలకు నివాసంలో లైట్లు ఆన్నీ ఆఫ్‌ చేసి కొవ్వొత్తులు, దీపాలు వెలిగించడం ద్వారా కోవిడ్‌ –19 పై జరుగుతున్న పోరాటానికి సంఘీభావం తెలిపారు. దేశ ప్రజలంతా ఒక్కటై ఐక్యంగా ముందుకు సాగాలని సీఎం ఇప్పటికే తన సందేశంలో పేర్కొన్నారు. ఈ […]

Written By: Neelambaram, Updated On : April 6, 2020 11:22 am
Follow us on

కరోనా వైరస్‌ మీద జరుగుతున్న పోరాటానికి సంఘీభావం తెలుపుతూ దీపాలు వెలిగించాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుమేరకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ ఈ రాత్రి తొమ్మిది గంటలకు తన నివాసంలో కొవ్వొత్తులు వెలిగించారు. సరిగ్గా తొమ్మిది గంటలకు నివాసంలో లైట్లు ఆన్నీ ఆఫ్‌ చేసి కొవ్వొత్తులు, దీపాలు వెలిగించడం ద్వారా కోవిడ్‌ –19 పై జరుగుతున్న పోరాటానికి సంఘీభావం తెలిపారు. దేశ ప్రజలంతా ఒక్కటై ఐక్యంగా ముందుకు సాగాలని సీఎం ఇప్పటికే తన సందేశంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌ నీలంసాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్యఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి, సీఎం కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.

భారతీయుల దీక్ష, దక్షతలకు ప్రతిరూపంగా జ్యోతీప్రజ్వలన: గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్

కరోనా మహమ్మారి నుండి భారతావనిని రక్షించుకునే క్రమంలో రాష్ట్ర ప్రజలంతా దీపాలు వెలిగించి తమలోని ఐక్యతను చాటటం ముదావహమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో రాజ్ భవన్ లో గౌరవ గవర్నర్ దంపతులు బిశ్వ భూషన్ హరిచందన్, సుప్రవ హరిచందన్ స్వయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 9 నిమిషాల పాటు గవర్నర్ దంపతులు జ్యోతులను వెలిగించి కరోనా వ్యాప్తి నిరోధం పట్ల తమ అంకాంక్షను ప్రపంచానికి చాటారు.
ఈ సందర్భంగా గవర్నర్ సందేశం ఇస్తూ ప్రతి ఒక్కరూ తమ ఇళ్లవద్దనే ఉండి ఇళ్లల్లోని విద్యుత్‌ దీపాలను ఆపేసి, జ్యోతులు వెలిగించి, తమ ధృఢ సంకల్పాన్ని వెల్లడించటం సహేతుకమైన పోరాటానికి నిదర్శనమన్నారు. జనతా స్ఫూర్తిని మరోమారు చాటుతూ, రాష్ట్ర ప్రజలు తమ విలువైన సమయంలో 9 నిమిషాలు దేశం కోసం కేటాయించటం అభినందనీయం అన్నారు.

కారోనా ను తరిమికొట్టాలి: బాబు
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హైదరాబాద్లోని వారి నివాసంలో క్యాండీల్స్ వెలిగించారు. దేవాంషు ఈ కార్యక్రమంలో పాల్గొని టార్చితో వెలుగు ప్రదర్శించాడు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కరోనాపై పోరాటం చేసి తరిమి కొట్టాలన్నారు.