https://oktelugu.com/

మానవత్వం చూపుతున్న మెగా కోడలు

కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంత భయపెట్టినా కొంతలో కొంత మేలు చేస్తోంది.ప్రజల మధ్య సంఘీభావం పెంచు తోంది. ఒకరికి ఒకరు తోడుండాలి అన్న నిత్య సత్యాన్ని మళ్ళీ గుర్తు చేస్తోంది. ఉన్నోడికి లేనోడి భాద అర్ధమయ్యేలా చేసింది. ఇంకా చెప్పాలంటే నిద్రపోతున్న మానవత్వాన్ని మేల్కొలిపింది. మన చుట్టూ ఉన్న వాళ్లలో అంతర్లీనంగా ఉన్న సేవా గుణం ఇప్పుడు బయటికి వస్తోంది. దాంతో ఇతరులకు తమ చేతనైనంత, చేయగలిగినంత సాయం చేస్తున్నారు. మానవ సమాజం బలంగా సంఘటిత మౌతోంది. […]

Written By:
  • admin
  • , Updated On : April 6, 2020 / 11:49 AM IST
    Follow us on


    కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంత భయపెట్టినా కొంతలో కొంత మేలు చేస్తోంది.ప్రజల మధ్య సంఘీభావం పెంచు తోంది. ఒకరికి ఒకరు తోడుండాలి అన్న నిత్య సత్యాన్ని మళ్ళీ గుర్తు చేస్తోంది. ఉన్నోడికి లేనోడి భాద అర్ధమయ్యేలా చేసింది. ఇంకా చెప్పాలంటే నిద్రపోతున్న మానవత్వాన్ని మేల్కొలిపింది. మన చుట్టూ ఉన్న వాళ్లలో అంతర్లీనంగా ఉన్న సేవా గుణం ఇప్పుడు బయటికి వస్తోంది. దాంతో ఇతరులకు తమ చేతనైనంత, చేయగలిగినంత సాయం చేస్తున్నారు. మానవ సమాజం బలంగా సంఘటిత మౌతోంది. నిత్యాన్న దానం చేస్తున్న మహానుభావులు ఇపుడు చాలా మంది తయారయ్యారు. అనిశ్చిత గృహ నిర్బంధం మానవ సంబంధాలకు వారధి అయ్యింది. ఎన్నో మంచి పనులు చేయిస్తోంది.

    లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్నరోజువారీ సినీ కార్మికుల సంక్షేమం కోసం తెలుగు చిత్ర పరిశ్రమ నడుం బిగించింది. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ‘కరోనా క్రైసిస్ చారిటీ ‘ ( సి సి సి ) ఏర్పాటైంది. మెగా కుటుంబ సభ్యులతో పాటు పలువురు తారలు , నిర్మాతలు , దర్శకులు ,సాంకేతిక నిపుణులు ముందుకొచ్చి విరాళాలు ఇచ్చారు. సుమారు 7 కోట్ల పైనే విరాళాలు పోగయ్యాయి. ఇపుడా డబ్బుని రోజువారీ సినీ కార్మికుల నిత్యావసరాల కోసం వెచ్చించ బోతున్నారు . దానిలో కొంత ఆర్ధిక సాయం కూడా ఉంటుందట ..ఇవన్నీ ఒకెత్తు అయితే చిరంజీవి కోడలు , రాంచరణ్ భార్య అయిన ఉపాసన కొణిదెల ఒక సంచలన నిర్ణయం తీసుకొంది. తాను డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్న అపోలో హాస్పిటల్స్ కి సంబందించిన ఫార్మసీ లలో సినీ రంగానికి చెందిన దినసరి కార్మికులకు ఉచితంగా మందులు ఇచ్చేందుకు సంకల్పించింది.