ముస్లిం సోదరులకు తెలుగు సోదరుల విన్నపం!

ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో జరిగిన ప్రార్ధనలకు వెళ్లొచ్చిన ముస్లిం సోదరుల పట్ల తెలుగు సోదరులు సానుకూలంగా స్పందిస్తున్నారు. తెలంగాణ నుండి దాదాపు1030 మంది, ఆంధ్ర నుండి 720 మంది ఈ ప్రార్ధనలకు వెళ్లొచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులకు విన్నపాలు అందుతున్నాయి. తెలుగు సోదరుల స్పందన ” ముస్లిం సోదరులారా..మీరేమీ తప్పుచేయలేదు కదా.. మతం రీత్యా ప్రార్థనలకు వెళ్లారు.. హ్యాపీగా ఇంటికి వచ్చారు , కాని మీకు తెలియకుండా, […]

Written By: Neelambaram, Updated On : April 1, 2020 5:08 pm
Follow us on

ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో జరిగిన ప్రార్ధనలకు వెళ్లొచ్చిన ముస్లిం సోదరుల పట్ల తెలుగు సోదరులు సానుకూలంగా స్పందిస్తున్నారు. తెలంగాణ నుండి దాదాపు1030 మంది, ఆంధ్ర నుండి 720 మంది ఈ ప్రార్ధనలకు వెళ్లొచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులకు విన్నపాలు అందుతున్నాయి.

తెలుగు సోదరుల స్పందన

” ముస్లిం సోదరులారా..మీరేమీ తప్పుచేయలేదు కదా.. మతం రీత్యా ప్రార్థనలకు వెళ్లారు.. హ్యాపీగా ఇంటికి వచ్చారు , కాని మీకు తెలియకుండా, కరోనా మహమ్మారి మీ వెంట వచ్చిందేమో చెక్ చేయించుకోండి.. మీ ఫ్యామిలీని సేవ్ చేసుకుంటారు.. మన ఇండియా ని కూడా సేవ్ చేస్తారు.. అందరం హ్యాపీగా ఉందాం..దయచేసి జస్ట్ మెడికల్ చెకప్ చేయించుకోండి.. పోయేదేముంది.. పాజిటివ్ వస్తె ట్రీట్మెంట్ తీసుకుంటారు, నెగిటివ్ వస్తే హ్యాపీగా ఇంటికెళ్ళి ఫ్యామిలీ హ్యాపీగా వుంటారు” అన్ని పొన్ని రెడ్డి సోమేశ్ అన్నారు.

“మీనుంచి. ఎంతమందికి అంటుకుంటుందో ….. జరిగిందేదో జరిగింది. మీరు వచ్చి మీ కుటుంబాన్ని. మీ చుట్టుపక్కల ఉండే వారికి. వైరస్ సోకకుండా మిమట్టుకు మీరే… హాస్పటల్ కి వెళ్లి వైద్యం చేయించుకుంటే…. మంచిదే కదా లేదంటే.. మీతో పాటు. మీ చుటటుపక్కల వారిని కూడా. ప్రమాదం లో పడటానికి. కరణం మీరే అవుతారు
….. కానీ ఒకటి మాత్రం నిజం…. మీరు బ్రతికున్న ప్రతి రోజు మీరు మీ కుటంబీకులు. మీ విదిలో తలెత్తుకొని తిరగలేరు… చాలా బాధ పడతారు. మీరు ప్రభుత్వం నికి సహకరించాలి….” అని రవి అనే వ్యక్తి అన్నారు.

“సమాజానికి మనము చేసేది ఏమి లేదు. నిజాన్ని ఒప్పుకుని మన దేశముముని కాపాడుదాo. అందరు సహకరించడి…….” అని బాలు అనే వ్యక్తి స్పందించారు.

 

ఇప్పటికే అనేకమంది ముస్లిం సోదరులు స్వచ్చందంగా వచ్చి టెస్టులు చేయించుకున్నారు. అనేకమందికి నెగటివ్ రావడంతో 14 వారిని ఇంటికి పంపించారు. మిగిలినవారు కూడా వచ్చి కరోనా టెస్టులు చేయించుకుంటే మంచిదని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు.