మర్కజ్ విదేశీయులపై వీసా ఉల్లంఘన చర్యలు

కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేయడంలో విజయం సాధించామని అనుకొంటున్న సమయంలో ఢిల్లీలోని మర్కజ్ సంఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. ఇక్కడ పాల్గొన్న వారిలో పలువురికి కోరిన వైరస్ పాజిటివ్ రావడంతో దేశంలో సుమారు 20 రాష్త్ర ప్రభుత్వాలు మిగిలిన వారి ఆచూకీ కోసం జల్లెడ పడుతున్నాయి. నిజాముద్దీన్ మర్కజ్ లోని ఉన్న వ్యక్తులను క్వారంటైన్‌కు తరలించేందుకు తబ్లిగ్ జమాత్ నేత మౌలానా సాద్ మొదట నిరాకరించడంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జాతీయ భద్రతా […]

Written By: Neelambaram, Updated On : April 1, 2020 6:07 pm
Follow us on

కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేయడంలో విజయం సాధించామని అనుకొంటున్న సమయంలో ఢిల్లీలోని మర్కజ్ సంఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది.

ఇక్కడ పాల్గొన్న వారిలో పలువురికి కోరిన వైరస్ పాజిటివ్ రావడంతో దేశంలో సుమారు 20 రాష్త్ర ప్రభుత్వాలు మిగిలిన వారి ఆచూకీ కోసం జల్లెడ పడుతున్నాయి.

నిజాముద్దీన్ మర్కజ్ లోని ఉన్న వ్యక్తులను క్వారంటైన్‌కు తరలించేందుకు తబ్లిగ్ జమాత్ నేత మౌలానా సాద్ మొదట నిరాకరించడంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ ను రంగంలోకి దిగి దానిని ఖాళీ చేయించారు. మొత్తంమీద 2300 మందిని మర్కజ్ నుంచి భద్రతాధికారులు ఖాళీ చేయించి ఆసుపత్రులకు పంపారు.

ఢిల్లీలోని మర్కజ్ ప్రాంతంలోనే 216 మంది విదేశీయులున్నారు. దీంతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లోని మసీదుల్లో 800 మంది ఇండోనేషియా, మలేషియా, బంగ్లాదేశ్ లకు చెందిన వారున్నారని తేలడంతో వారందరికీ వైద్యపరీక్షలు చేయించి, వీసా నిబంధనల ఉల్లంఘనపై వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ నిర్ణయించింది. టూరిస్టు వీసాలపై వచ్చిన విదేశీయులు వీసా నిబంధనలను ఉల్లంఘించారని హోంశాఖ అధికారులు చెప్పారు.

ఇట్లా ఉండగా, వైరస్ దేశ వ్యాప్తి చెందడానికి కారణంగా అపాల్గొన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న విదేశీయులపై కేంద్రం కన్నేసింది. వీసా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తగు చర్యలు తీసుకోవడానికి సమాయత్తం అవుతున్నది.

పైగా వీరిలో అంతకు ముందు కోలంపూర్ ఇటువంటి సమావేశానికి కూడా హాజరై వచ్చారని, ఆ దేశంతో పాటు పలు ఇతర దేశాలలో ఈ వైరస్ వ్యాప్తికి వీరే కారకులని ప్రచారం జరుగుతున్నది.

కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి నేడు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డిజిపిలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వీసా నిబంధనల ఉల్లంఘనను తీవ్ర అంశంగా పరిగణించాలని స్పష్టం చేశారు.

వారిలో చాలామంది ఇప్పుడు దేశంలో వివిధ ప్రదేశాలలో ఉన్నట్లు తెలుస్తున్నందున వారందరి ఆచూకీ కనిపెట్టి మొదటగా వారికి వైద్య పరీక్షలు జరిపించాలని, తర్వాత చట్టప్రకారం వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వీసా నిబంధనలను ఉల్లంఘించిన విదేశీయులపైనా, తబ్లిగి జమాత్ నిర్వాహకులపైనా చట్టపరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరింది. తబ్లిగి జమాత్‌లో పాల్గొన్నవారిని గుర్తించడం చాలా ముఖ్యమని తెలియజేసినట్లు పేర్కొంది.

కోవిడ్-19 మహమ్మారిని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారి వల్ల ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇలా ఉండగా, ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజనను వచ్చే వారంలోగా అమలు చేయాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. ఈ పథకం లబ్ధిదారులకు నగదు బదిలీ జరుగుతుందని పేర్కొంది. సామాజిక దూరాన్ని పాటిస్తూ, దీనిని అమలు చేయాలని తెలిపింది.

రాష్ట్రంలోపల సరుకు రవాణాను అనుమతించాలని, అయితే సామాజిక దూరాన్ని పాటించాలని చెప్పినట్లు వివరించింది. దేశవ్యాప్తంగా అష్ట దిగ్బంధనం సమగ్రంగా అమలవుతోందని ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు.