గుంటూరులో ఫస్ట్:ఎమ్మెల్యే బామ్మర్దికి కరోనా పాజిటివ్

  మార్చి 22 న దేశమంతా కర్ఫ్యూ అమలుపరుస్తున్న సమయంలో గుంటూరులోని మంగళదాస్ నగర్ 2వ లైన్ లో ఉన్న పారిశ్రామిక వేత్త మరియు వన్ టౌన్ ఎమ్మెల్యే(వైసీపీ) మొహ్మద్ ముస్తఫా షేక్ బామ్మర్ది వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 500మందితో ఒక పార్టీ ఇచ్చారు. అతనికే కరోన పాజిటివ్ అని తేలడంతో గుంటూరు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డది. ఆ పార్టీ సమయంలో అతను ఎంతమందిని టచ్ చేశారో వారికి కూడా కరోన వైరస్ సోకే ప్రమాదం ఉందని […]

Written By: Neelambaram, Updated On : March 26, 2020 5:24 pm
Follow us on

 

మార్చి 22 న దేశమంతా కర్ఫ్యూ అమలుపరుస్తున్న సమయంలో గుంటూరులోని మంగళదాస్ నగర్ 2వ లైన్ లో ఉన్న పారిశ్రామిక వేత్త మరియు వన్ టౌన్ ఎమ్మెల్యే(వైసీపీ) మొహ్మద్ ముస్తఫా షేక్ బామ్మర్ది వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 500మందితో ఒక పార్టీ ఇచ్చారు. అతనికే కరోన పాజిటివ్ అని తేలడంతో గుంటూరు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డది.

ఆ పార్టీ సమయంలో అతను ఎంతమందిని టచ్ చేశారో వారికి కూడా కరోన వైరస్ సోకే ప్రమాదం ఉందని వైద్యులు అనుమానం వ్యక్తం చేయడంతో వన్ టౌన్ ప్రాంతంలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. విందుకు వచ్చిన వందల మందిలో కూడా కరోనా వ్యాప్తి చెందే ఉండవచ్చనే అంచనా వేస్తున్నారు. వారిలో ఇప్పటికే 80మందిని అదుపులోకి తీసుకొని పరీక్షలు నిర్వహిస్తున్నారు.మిగిలిన 420మంది ఆచూకీ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు.అలాగే ఎమ్మెల్యే(వైసీపీ) మొహ్మద్ ముస్తఫా షేక్ కూడా ఈ 10రోజుల్లో ఎవరెవరిని కలిసారనే దానిపై ఆరా తీస్తున్నారు.గుంటూరు వన్ టౌన్ లో తొలి కరోనా కేసు నమోదు కావడంతో అధికార యంత్రంగం కఠిన ఆంక్షలు విధించింది. వన్ టౌన్ ప్రాంతంలోని ప్రజలు ఎవరు కూడా ఇంట్లో నుండి బయటకు రాకూదని ఆదేశాలు జారీ చేసింది.

అజ్మీర్ వెళ్ళిన ఎమ్మెల్యే బామ్మర్ది ఈ నెల 19వ తేదీన గుంటూరు వచ్చి అక్కడ కర్ఫ్యూ రోజున పార్టీ ఇచ్చారు. ఆ మరుసటి రోజు జలుబు, జ్వరం లక్షణాలతో అతను ఆసుపత్రిలో చేరడంతో పరీక్షలు నిర్వహించి కరోన పాజిటివ్ అని తేల్చారు.

ఇదిలా ఉండగా కర్ఫ్యూ రోజు 500మంది పార్టీ కోసం ఎవరు అనుమతించారు? పార్టీకి వెళ్లే వారిని పోలీసులు అడ్డుకోలేదా..? లేదా వెళ్ళడానికి పోలీసులే సహకరించారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ విషయంపై కూడా అధికారులు దర్యాప్తు ప్రారంభించారు